Sapta Sagaralu Dhaati: హ‌మ్మ‌య్యా.. ఓటీటీలోకి వ‌చ్చిన‌ ప్రేమికుల‌ గుండె బ‌రువెక్కించే సినిమా

ABN , Publish Date - Jan 25 , 2024 | 08:25 PM

గ‌త సంవ‌త్స‌రం విడుద‌లై క‌ల్ట్ చిత్రంగా పేరు తెచ్చుకున్న క‌న్న‌డ చిత్రం సప్తసాగరాలు దాటి. సైడ్ ఏ,సైడ్ బీ అంటూ రెండు భాగాలుగా సెప్టెంబ‌ర్‌, న‌వంబ‌ర్ నెల‌లో విడుద‌లై ఈ సినిమాలు మూవీ ఆఫ్ ది ఇయ‌ర్‌గా ఘ‌న‌త ద‌క్కించుకుని ఆల్‌టైం గ్రేట్ మూవీస్ లిస్ట్‌లో చేరాయి. అయితే న‌వంబ‌ర్‌లో విడుద‌లై సైడ్ బీ ఎట్ట‌కేలకు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది.

Sapta Sagaralu Dhaati: హ‌మ్మ‌య్యా.. ఓటీటీలోకి వ‌చ్చిన‌ ప్రేమికుల‌ గుండె బ‌రువెక్కించే సినిమా
saptha sagaralu dhaati

గ‌త సంవ‌త్స‌రం విడుద‌లై క‌ల్ట్ చిత్రంగా పేరు తెచ్చుకున్న క‌న్న‌డ చిత్రం సప్తసాగరాలు దాటి (Sapta Sagaralu Dhaati). సైడ్ ఏ,సైడ్ బీ అంటూ రెండు భాగాలుగా సెప్టెంబ‌ర్‌, న‌వంబ‌ర్ నెల‌లో విడుద‌లై ఈ సినిమాలు మూవీ ఆఫ్ ది ఇయ‌ర్‌గా ఘ‌న‌త ద‌క్కించుకుంది. ఆల్‌టైం గ్రేట్ మూవీస్ లిస్ట్‌లో చేరాయి. అయితే న‌వంబ‌ర్‌లో విడుద‌లై సైడ్ బీ ఎట్ట‌కేలకు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది. రక్షిత్ శెట్టి (Rakshit Shetty), రుక్మిణి (Rukmini Vasanth) జంటగా ఎమోషనల్, లవ్, డ్రామా జానర్‌లో రూపొందిన ఈ సినిమాకు హీరో రక్షిత్ శెట్టినే నిర్మాతగా వ్యవహరించగా హేమంత్ రావు (Hemanth Rao) రచన, దర్శకత్వం చేశారు. ఈ చిత్రం మొద‌టి భాగం సప్తసాగరాలు దాటి సైడ్ ఏ విడుదలైన రెండు నెలల్లోనే సైడ్ బీ కూడా విడుదలై విజయం సాధించడం గమనార్హం.

సప్తసాగరాలు దాటి సైడ్ ఏలో హీరో (మ‌ను) జైలుకు వెళ్ల‌డం, బ‌య‌ట‌కు రాలేక పూర్తి శిక్షా కాలం అనుభ‌వించాల్సి రావ‌డం, హీరో బ‌ల‌వంతంతో క‌థానాయిక (ప్రియ) మ‌రొక‌రిని పెళ్లి చేసుకోవ‌డంతో ముగించారు. ఇక రెండో భాగం సైడ్ బీలో హీరో బ‌య‌ట‌కు వ‌చ్చి త‌న ప్రియురాలిని మ‌రిచిపోలేక ఆమెను వెతుక్కుంటూ, అనుక్ష‌ణం కథానాయిక గురించి ఆలోచిస్తూ తీవ్ర మానసిక సంఘ‌ర్షణ పడతాడు. ఆ త‌ర్వాత‌ ఆమె ఇంటి స‌మీపంలోనే ఉంటూ ఆమె సంతోషంగా ఉందా లేదా అంటూ గమనిస్తూ ఉంటాడు. ఈ క్ర‌మంలో ఆమెను హ్యాపీగా ఉంచ‌డం కోసం హీరో ఏం చేశాడు, అస‌లు క‌థానాయికకు ప్రియుడు గుర్తున్నాడా, జైలు నుంచి వ‌చ్చాక క‌లిసిందా వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమా చూసే ప్రేక్షకుల గుండెనత్తుకునేలా సాగుతుంది.


ఔట్ అండ్ ఔట్ ఫుల్ ఎమోషనల్ గా సాగే ఈ సినిమా స్లోగా రన్ అయినా అందులోని పాట‌లు, మాట‌లు, హీరోయిన్, క్యారెక్టర్స్ ఓ ఫీల్‌ను ఇవ్వ‌డ‌మే గాక‌ చాలాకాలం గుర్తుండిపోయేలా ఈ చిత్రం తెరకెక్కింది. ముఖ్యంగా మొద‌టి భాగం మొత్తం ఎలాంటి ఫైట్స్ లేకుండానే సాగగా రెండో భాగంలో మాత్రం వ‌య‌లెన్స్ ఎక్కువ‌గానే ఉంటుంది. ఇప్పటికే మొదటి పార్ట్ సప్త సాగరాలు దాటి ((Sapta Sagaralu Dhaati)) సైడ్ ఏ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుండగా, రెండో భాగంసైడ్ బీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) లో ఈ రోజు నుంచి (జ‌న‌వ‌రి 25)న ఓటీటీలో విడుదల కానుంది. థియేటర్లలో మిస్సయిన వారు ఓటీటీలో మాత్రం మిస్సవకండి.

ఈ సినిమాతో క‌న్న‌డ నాట ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారిన హీరోయిన్ రుక్మిణి వ‌సంత్ (Rukmini Vasanth)కు అన్ని సినిమా ఇండ‌స్ట్రీల నుంచి ఆఫ‌ర్లు త‌లుపులు త‌డుతున్నాయి. ఇప్ప‌టికే క‌న్న‌బడ‌లో నాలుగు సినిమాలు చేస్తుండ‌గా, త‌మిళంలో విజ‌య్ సేతుప‌తితో ఓ సినిమా, తెలుగులో ర‌వితేజ ,రామ్ స‌ర‌స‌న ఛాన్స్ కొట్టేసింది.

Updated Date - Jan 25 , 2024 | 08:25 PM