Animal: త‌ట్టుకోలేక‌పోతున్నాం.. యానిమ‌ల్‌ను నెట్‌ఫ్లిక్స్ నుంచి తొల‌గించండి!

ABN , Publish Date - Jan 28 , 2024 | 06:53 PM

యానిమ‌ల్‌ చిత్రం దేశంలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత ర‌చ్చ చేసిందో తెలిసిందే. చిత్రం థియేట‌ర్ల‌లో విడుద‌లైన‌ప్పుడు ఎంత సంచ‌ల‌నం అయిందో ఇప్పుడు ఓటీటీలోకి వ‌చ్చాక అంత‌కు రెండింత‌లు రెట్టింపుగా వార్త‌ల్లో నిలుస్తోంది.

Animal: త‌ట్టుకోలేక‌పోతున్నాం.. యానిమ‌ల్‌ను నెట్‌ఫ్లిక్స్ నుంచి తొల‌గించండి!
ANIMAL

యానిమ‌ల్ (Animal) చిత్రం దేశంలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత ర‌చ్చ చేసిందో తెలిసిందే. 2023 డిసెంబ‌ర్ 1న విడుద‌లైన ఈ సినిమా దాదాపు రూ. 900కోట్ల‌కు పైగానే కెల‌క్ష‌న్లు రాబ‌ట్టి భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా (SandeepReddy Vanga), హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor)కు బాటీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్‌ను సాధించి పెట్ట‌గా అదే స్థాయిలో వ్య‌తిరేక‌త‌ను క‌ట్ట‌బెట్టింది. చిత్రం థియేట‌ర్ల‌లో విడుద‌లైన‌ప్పుడు ఎంత సంచ‌ల‌నం అయిందో ఇప్పుడు ఓటీటీలోకి వ‌చ్చాక అంత‌కు రెండింత‌లు రెట్టింపుగా వార్త‌ల్లో నిలుస్తోంది.

GER_OA5akAANcgm.jpeg

ఇటీవ‌లే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఈ సినిమా ప్ర‌తి ఇంటికి చేర‌డంతో థియేట‌ర్ల‌లో చూడ‌ని వారు ఇప్పుడు సినిమాను తిల‌కిస్తూ సినిమాపై త‌మ అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు. అయితే ఎవ‌రు ఊహించ‌ని విధంగా చాలా మంది నుంచి నెగెటివ్ రిపోర్ట్స్ వ‌స్తున్నాయి. దీన్ని ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంటారా.. అస‌లు దీన్ని సినిమా అంటారా అంటూ ఏకి పారేస్తున్నారు. మ‌రికొంతమంది సినిమాను నెట్‌ఫ్లిక్స్ (Netflix) నుంచి తొల‌గించాలంటూ డిమాండ్ చేయ‌డం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.


యానిమ‌ల్ (Animal) సినిమా పూర్తిగా మ‌హిళ‌ల‌ను కించ‌ప‌ర్చేలా ఉన్న‌ద‌ని, హింస‌ను ప్రేరేపించేలా, హిందూ సంస్కృతిని పూర్తిగా దెబ్బ తీసేలా ఉన్న‌ద‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెళ్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినీ ఇండ‌స్ట్రీ నుంచే భారీగా అస‌హ‌నం వ్య‌క్తమ‌వుతుందంటే ప‌రిస్థితి ఎలా ఉందో తెలుసుకోవ‌చ్చు. ముఖ్యంగా అల‌నాటి రాధిక దీన్ని సినిమా అంటారా అర గంట కూడా చూడ‌లేక పోయానంటూ సామాజిక మాధ్య‌మం ఎక్స్‌లో సినిమా పేరు చెప్పుకుండా కామెంట్ చేసింది. దీంతో రాధిక యానిమ‌ల్ గురించే మాట్లాడిందంటూ నెట్టింట వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. ఒక్క రాధిక నుంచే కాకుండా బాలీవుడ్ లిరికిస్ట్ జావెద్ అక్త‌ర్ మ‌రికొంత‌మంది ఇలాంటి అభిప్రాయం వెలిబుచ్చ‌డంతో సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.

GE7pV96bwAA9NOa.jpegఅదేవిధంగా రాజ‌కీయంగా నాయ‌కులు, సామాజిక వేత్త‌లు, ఇండ‌స్ట్రీయ‌లిస్టులు, నెటిజ‌న్లు ఇప్పుడు యానిమ‌ల్ (Animal) సినిమాను చూసి ఓ రీతిలో ద్వ‌జ‌మెత్తుతున్నారు. ఓ రెండు డైలాగులు, ఓ చిన్న స‌న్నివేశం ఉంద‌ని అన్న‌పూర్ణి సినిమాను ఓటీటీ నుంచి తొల‌గించారు. మ‌రి ఇందులో అంత‌కుమించిన వివాదాస్ప‌ద అంశాలు, మితీమీరిన హింసా స‌న్నివేశాలు, మ‌హిళ‌ల‌ను కించ ప‌రిచే దృశ్యాలు ఉన్నాయి దీనిని ఎలా ప్ర‌సారం చేస్తున్నారు వెంట‌నే తొల‌గించండంటూ డిమాండ్‌లు పెరుగుతున్నాయి.


ముఖ్యంగా సినిమా మ‌న వదేశంలో అనాదిగా ఉన్న వివాహా వ్యవ‌స్థ‌ను కించ ప‌రిచేలా, ఒక వ్య‌క్తికి ఒకే భార్య అన్న సాంప్ర‌దాయాల‌ను దెబ్బ తీసేలా ఉండ‌డంతో పాటు విశృంఖ‌ల శృంగాన్ని ప్రోత్స‌హించేలా ఉన్న‌ద‌ని ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించ‌వ‌ద్ద‌ని వెంట‌నే నెట్‌ఫ్లిక్స్ నుంచి తొల‌గించి ప్రేక్ష‌కుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని చిత్రం రూపొందించిన‌, న‌టించిన వారిని శిక్షించాలంటూ చాలా మంది నెటిజ‌న్లు సోష‌ల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చూడాలి మున్ముందు ఈ ఇష్యూ ఎంత‌వ‌ర‌కు వెళ్తుందో.

GE2zDymbMAAnn73.jpegఅయితే ఈ చిత్రంపై విమ‌ర్శ‌లు వెళ్లువెత్తుతున్న స‌మ‌యంలో దీనికి విరుద్ధంగా చాలామంది త‌మ‌దైన శైలిలో స్పందిస్తూ కాక రేపుతున్నారు. సినిమా బాలేద‌న్న‌వారు సినిమాను తొల‌గించ‌మ‌ని చెప్పే బ‌దులు మీ స‌బ్ స్క్రిప్స‌న్ డియాక్టివేట్ చేసుకోవ‌చ్చు క‌దా అని సెటైర్లు వేస్తున్నారు. అంతేగాక నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఇండియాలో కొత్త సాంప్ర‌దాయం తేవాల‌ని మ‌త‌ప‌ర‌మైన ఇష్యూల‌తో వ‌చ్చే సినిమాలను స్ట‌డీ చేసేందుకు, ఫిర్యాదులు చేసే వారిని గుర్తించి వారికి అనుగుణంగా సినిమాలు ప్ర‌సారం చేయాలంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Jan 29 , 2024 | 03:54 PM