Bhamakalapam2: ప్రియమణి ’భామాకలాపం 2‘ థియేటర్లలో కాదు.. ఓటీటీలోనే! స్ట్రీమింగ్ ఎప్ప‌టినుంచంటే?

ABN , Publish Date - Jan 31 , 2024 | 06:59 AM

ప్రియమణి న‌టించిన‌ భామా క‌లాపం2 ఓటీటీలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా భామా క‌లాపం2 రూపొందుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా మంగ‌ళ‌వారం టీజర్‌ను విడుదల చేశారు.

Bhamakalapam2: ప్రియమణి ’భామాకలాపం 2‘ థియేటర్లలో కాదు.. ఓటీటీలోనే! స్ట్రీమింగ్ ఎప్ప‌టినుంచంటే?
bhama kalapam

క‌రోనా స‌మ‌యంలో వ‌చ్చిన ప్రియమణి (#Priyamani) న‌టించిన‌ భామా క‌లాపం2 (#Bhamakalapam) ఓటీటీలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అనుపమ మోహన్ అనే ఫేమస్ యూ ట్యూబర్ కం గృహిణి. అంతేగాక‌ ఎల్ల‌ప్పుడూ అవతలి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో? అని తెలుసుకోవాల‌నే వింత అల‌వాటు ఉంటుంది. ఈ క్ర‌మంలో ఓ రోజు ఒకరి ఇంట్లోకి వెళ్లి ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. దానిని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు చేసే ప్ర‌య‌త్నాల‌తో ఈ చిత్రం ఆద్యంతం స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్‌గా కొన‌సాగుతూ ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది. దాదాపు నాలుగు మిలియన్ల పైనే వ్యూస్‌తో అందరినీ కట్టి పడేసింది.

అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా భామా క‌లాపం2 (#Bhamakalapam2) రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే విడుదలైన చిత్రం ఫస్ట్‌లుక్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా మంగ‌ళ‌వారం (30.1.2024) ‘భామా కలాపం 2’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో అనుపమ పాత్రలో ప్రియమణి (Priyamani) అమాయకపు గృహిణిగా మ‌రోమారు కనిపించ‌నుంది. ఈ చిత్రాన్ని ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు, సుధీర్ ఈదర అసోసియేషన్ డ్రీమ్ ఫార్మర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించగా.. సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అభిమన్యు తడిమేటి (#Abhimanyu Tadimeti) దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రాన్ని ఈ సారి ఓటీటీలోకి తేకుండా నేరుగా థియేట‌ర్లలో విడుద‌ల చేయాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ తిరిగి మ‌ళ్లీ ఓటీటీలోకే తీసుకువ‌స్తున్నారు.


ఇక ఈ భామా క‌లాపం2 (#Bhamakalapam2) చిత్ర ట్రైల‌ర్‌ విష‌యానికి వ‌స్తే అనుపమ (ప్రియమణి) (Priyamani) తన గత జీవితాన్ని, అపార్ట్‌మెంట్‌ను విడిచిపెట్టి, ఆమె భర్తకు ఇచ్చిన మాట ప్రకారం కొత్త ప్రాంతంలో త‌మ‌ జీవితాన్ని ప్రారంభిస్తారు. 'అనుపమ అనే నేను, పక్కన వాళ్ళ విషయాలలో తలదూర్చనని, నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటానని" మాట ఇస్తున్నాను అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభం అయింది. అదే సమయంలో ఓపెద్ద రెస్టారెంట్‌లో ఓ వ్య‌క్తిని దారుణంగా హత్య చేస్తుంది. ఆ క్రైం నుంచి ఆమె ఎలా బయట పడింది అనేది ప్రధానాంశం. టీజర్‌లో వినోదంతో పాటు చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ టీజర్‌లో ప్రియమణి (#Priyamani), శరణ్య ప్రదీప్ (Sharanya Pradeep) టైమింగ్ నవ్వులు పూయిస్తుండ‌గా. డైలాగ్స్‌, యాక్షన్ స‌న్నావేశాలు ఇలా అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫిబ్రవరి 16న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Updated Date - Jan 31 , 2024 | 07:00 AM