The Goat Life OTT update: ఓటీటీలోకి రూ.150 కోట్లు కొల్ల‌గొట్టిన మ‌ల‌యాళ‌ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌.. తెలుగులోనూ

ABN , Publish Date - May 21 , 2024 | 09:52 PM

ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) రెడీ అవుతోంది. మార్చి 28న పాన్ ఇండియా స్థాయిలో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.150 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించి రికార్డు సృష్టించింది.

The Goat Life OTT update: ఓటీటీలోకి రూ.150 కోట్లు కొల్ల‌గొట్టిన మ‌ల‌యాళ‌ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌.. తెలుగులోనూ
TheGoatLife

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ది గోట్ లైఫ్’ (The Goat Life) (ఆడు జీవితం) రెడీ అవుతోంది. మార్చి 28న పాన్ ఇండియా స్థాయిలో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.150 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించి రికార్డు సృష్టించింది. ఫృథ్వీరాజ్ సుకుమార‌న్ (Prithviraj Sukumaran) హీరోగా న‌టించిన ఈ చిత్రానికి ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు బ్లెస్సీ (Director Blessy) ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా అమ‌లాపాల్ ఓ పాత్ర‌లో న‌టించింది. అస్కార్ అవార్డు గ్ర‌హీత ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించారు.

90వ‌ దశకంలో జీవనోపాధి కోసం కేర‌ళ నుంచి గల్ఫ్ దేశానికి వలస వెళ్లిన నజీబ్ (Najib) అనే వ్యక్తి జీవిత కథ ఈ సినిమాకు మూలం. ప్ర‌ముఖ రచయిత బెన్యామిన్ న‌జీబ్‌ (Writer Benjamin Najib) న‌జీర్ లైఫ్‌లో జ‌రిగిన‌ ఘ‌ట‌న‌లను పుస్త‌కంగా తీసుకురాగా దాని ఆధారంగా ఈ స‌ర్వైవ‌ల్ డ్రామా సినిమాను తెర‌కెక్కించారు. 2008లో ప‌ట్టాలెక్కిన ఈ చిత్రం దాదాపు 16 ఏండ్ల పాటు షూటింగ్, ఇత‌ర కార్య‌క‌లాపాలు పూర్తి చేసుకుని 2024 మార్చి 28న విడుద‌లై ‘ది గోట్ లైఫ్’ (The Goat Life) అంత‌టా పాజిటివ్ టాక్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించింది.

thegoatlife.jpg


క‌థ విష‌యానికి వ‌స్తే.. న‌జీర్ బ‌తుకుదెరువు కోసం ఓ ఎజెంట్ సాయంతో సౌదీ అరేబియాకు వెళ‌తాడు. అక్క‌డ చేయాల్సిన ప‌నేంటో తెలియ‌క ఎజెంట్ చెప్పాడ‌ని ఓ అర‌బ్ షేక్‌తో క‌లిసి వెళ్ల‌గా అత‌ను ఓ ఏడారి మ‌ధ్య‌లోకి తీసుకెళ్లి అక్క‌డ గోర్ల‌కు కాప‌లాగా ఉంచుతాడు. దీంతో ఎజెంట్ మోసం చేశాడ‌ని తెలుసుకున్న న‌జీర్ అక్క‌డి నుంచి వెళ్ల‌డానికి అర‌బ్ షేక్ ఒప్పుకోక పోగా బాగా దాడి చేస్తారు. అక్క‌డ మాట్లాడ‌డానికి ప‌క్క‌న మ‌నిషి లేక‌, అక్క‌డి నుంచి ఎలా వెళ్లాలో, ఎటు వెళ్లాలో తెలియ‌క అక్క‌డే చిక్కుకుపోతాడు. పైగా కొన్ని సంవ‌త్స‌రాల‌కు త‌న రూపు పూర్తిగా మారి పోవ‌డ‌మే కాక‌, మాట‌లు కూడా మాట్లాడ‌లేక పోతుంటాడు, ఒంటి నిండా దెబ్బ‌ల‌తో ఉండాల్సి వ‌స్తుంది.

thegoatlifeone.jpg

అయితే కొన్నాళ్ల‌కు న‌జీర్ గోర్లు కాస్తున్న స‌మ‌యంలో త‌న లాంటి మ‌రో వ్య‌క్తి క‌లిసి ఇక్క‌డి నుంచి పారి పోవ‌డానికి ఓ ఫ్లాన్ ఉంద‌ని ఓ మ‌నిషి సాయం చేస్తాడ‌ని చెప్తాడు. ఈ క్ర‌మంలో న‌జీర్ అ ఎండ‌లో, దారుణ‌మైన ఎడారి నుంచి త‌ప్పించుకోగ‌లిగాడా, ఎవ‌రైనా సాయం చేశారా లేదా అనే క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను డిజిట‌ల్‌కు తీసుకురానున్నారు. మే 26 నుంచి డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్‌ (Disny Plus Hotstar) ఓటీటీలో మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్‌కు తీసుకు వ‌స్తున్నారు. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు ఓంట్లో చూసేయండి, డోంట్ మిస్‌. అయితే సినిమా ప్ర‌ధ‌మార్థంలో ఒక‌టి రెండు ముద్దు స‌న్నివేశాలు, కాస్త స్లో నెరేష‌న్‌ మిన‌హా ‘ది గోట్ లైఫ్’ (The Goat Life) సినిమానంత‌టిని ఫ్యామిలీతో చూసేయ‌వ‌చ్చు.

Updated Date - May 22 , 2024 | 10:16 AM