Salaar: ప్ర‌భాస్ ‘స‌లార్’.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌! ఎప్ప‌టినుంచంటే

ABN , Publish Date - Jan 16 , 2024 | 02:43 PM

సినీ అభిమానులు చాలామంది ఎదురు చూస్తున్న రోజు రానే వ‌చ్చింది. ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు డేట్ లాక్ చేశారు.

Salaar: ప్ర‌భాస్ ‘స‌లార్’.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌! ఎప్ప‌టినుంచంటే
salaar

సినీ అభిమానులు చాలామంది ఎదురు చూస్తున్న రోజు రానే వ‌చ్చింది. ప్ర‌భాస్ (Prabhas) న‌టించిన స‌లార్ (Salaar) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు డేట్ లాక్ చేశారు. గ‌త డిసెంబ‌ర్ 22న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం దేశ‌వ్యాప్తంగా ప్ర‌భాస్‌కు ఉన్న స్టామినాను మ‌రోమారు రుచి చూపించింది. షారుఖ్ ఖాన్ వంటి పెద్ద స్టార్ సినిమాకు పోటీ ఇచ్చి మ‌రి స‌రికొత్త రికార్డుల‌ను తిర‌గ‌రాసి రెండేండ్లుగా మంచి ఆక‌లి మీద ఉన్న ప్ర‌భాస్ మ‌రియు అభిమానుల‌ కోరిక తీర్చింది. 25 రోజుల్లో 750 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది.

salaar.jpg

KGF చిత్రాల ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన స‌లార్ (Salaar) చిత్రాన్ని హోంబ‌లే సంస్థ నిర్మించ‌గా శృతిహ‌స‌న్ క‌థానాయిక‌గా చేసింది. సినిమా షూటింగ్ మొదలైన దగ్గరి నుంచి వార్తల్లో నిలిచిన ఈ చిత్రం విడుదల తేదీలు వాయిదాలు పడుతూ చివరకు డిసెంబర్ 22న థియేటర్లలోకి వచ్చేసింది. రిలీజ్ కు ముందు అన్నీ సినిమాలకు చేసే విధంగా ఎలాంటి హంగు, ఆర్బాటం లేకుండా అంటే అడియో ఫంక్షన్ అని, ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఇలాంటివి ఏవీ లేకుండానే వచ్చి బాక్సాఫీస్ బూజు దులిపింది. సినిమాలో ప్రభాస్ ను చూయించిన విధానానికి అభిమానులు పండుగ చేసుకున్నారు. ఇది కదా ప్రభాస్ (Prabhas), ఇలా కదా మే చూడాలని అనుకుందంటూ రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు సంబురాలు చేసుకున్నారు.


సినిమాలో చూయించిన కాన్సార్ సామ్రాజ్యం, ఫ్రెండ్ షిప్, ముఖ్యంగా ఫైట్స్ ను ఫ్యాన్సే కాకుండా సినీ ప్రేక్షకులంతా ఎంజాయ్ చేశారు. అయితే సినిమా చివరలో ఇచ్చిన ట్విస్ట్ తో స‌లార్ (Salaar)సెకండ్ పార్ట్ కోసం అంతా ఇప్పటినుంచే ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇదిలాఉండగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీకి రావడానికి సిద్ధమైంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మూవీ విడుదలైన 45 రోజుల తర్వాత అంటే ఫిభ్రవరి 4న నెట్ ఫ్లిక్స్ లో స‌లార్ (Salaar) స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ ఏమైనా విడుదల తేదీలో మార్పు జరిగితే ఫిభ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవనుంది. సో ఎవరైనా థియేటర్లలో మిస్సైన వారికి, మళ్లీ చూడాలనుకునే వారికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ.

Updated Date - Jan 16 , 2024 | 02:49 PM