మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

TV actor Pavitranath: ప్రముఖ బుల్లితెర నటుడు పవిత్రనాథ్ మృతి

ABN , Publish Date - Mar 02 , 2024 | 12:23 PM

'చక్రవాకం', 'మొగిలి రేకులు' సీరియల్స్ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనపడిన ప్రముఖ బుల్లితెర నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇంకొక నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన తన సామాజిక మాధ్యమం ద్వారా తెలిసింది.

TV actor Pavitranath: ప్రముఖ బుల్లితెర నటుడు పవిత్రనాథ్ మృతి
Pavitranath of Mogili Rekulu fame is no more

బుల్లితెర మీద అత్యంత ప్రజాదరణ పొందిన సీరియల్ లలో 'మొగిలిరేకులు' ఒకటి. ఆ సీరియల్ లో 'దయ' పాత్రలో నటించిన, అందరికీ సుపరిచుడు అయిన పవిత్ర నాథ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని సహచర నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన తన సామాజిక మాధ్యమం ద్వారా చెప్పడంతో అందరికీ తెలిసింది. "ఈ వార్త నిజం కాకూడదు అని అనిపిస్తే ఎంతో బాగుండేది అనిపిస్తుంది. నువ్వు ఎంతో ముఖ్యమైన వ్యక్తివి మాకు, నువ్వు ఇలా మమ్మల్ని వదిలి వెళ్ళిపోవటం చాలా బాధగా వుంది. నీకు కనీసం వీడ్కోలు కూడా చెప్పలేకపోయాం," అని పెట్టారు. (Popular TV actor Pavitranath of 'Chakravaakam' fame is no more)

pavitranathisnomore.jpg

ఇంద్రనీల్ భార్య తన సామాజిక మాధ్యమంలో పవిత్రనాథ్ గురించి పోస్ట్ పెట్టారు కానీ, పవిత్ర నాథ్ ఎలా మరణించింది, ఏమైంది అనే విషయాలు మాత్రం బయటకి రాలేదు అని తెలుస్తోంది. 'మొగిలి రేకులు' సీరియల్ తో పాటు ఇంకో సీరియల్ 'చక్రవాకం' లో కూడా పవిత్రనాథ్ నటించాడు. ఈ రెండు సీరియల్స్ అత్యంత ప్రజాదరణ పొందిన సీరియల్స్. ఇందులో ఆ నటులు నిజమైన పేర్లు కాకుండా, సీరియల్స్ లోని పాత్రల పేర్లే ప్రేక్షకులకి ఎక్కువ గుర్తుండిపోయాయి అని చెపుతూ వుంటారు. (Chakravaakam, Mogilirekulu fame Pavitranath is passed away)

ఈ రెండు సీరియల్స్ లో ఇంద్రనీల్ తమ్ముడిగా నటించారు పవిత్రనాథ్. ఇప్పుడు ఇంద్రనీల్ భార్య మేఘన పెట్టిన పోస్టుకు అభిమానులు స్పందించారు. అసలు దయ (పవిత్ర నాథ్) కి ఏమైంది, అతను ఎందుకిలా చేసాడు అనే ప్రశ్నలు చాలామంది పోస్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందు పవిత్రనాథ్ భార్య అతనిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

Updated Date - Mar 02 , 2024 | 03:36 PM