Pindam: రెండు ఓటీటీల్లో.. దూసుకెళుతున్న హారర్ థ్రిల్లర్ ‘పిండం’

ABN , Publish Date - Feb 18 , 2024 | 01:12 PM

శ్రీరామ్, శ్రీనివాస్ అవసరాల, ఈశ్వరి రావు ముఖ్య పాత్రల్లో వ‌చ్చిన‌ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పిండం’ ఓటీటీలో దూసుకెళుతున్నది.

Pindam: రెండు ఓటీటీల్లో.. దూసుకెళుతున్న హారర్ థ్రిల్లర్ ‘పిండం’
pindam

తెలుగు, తమిళ నటుడు శ్రీరామ్ (Sriram), శ్రీనివాస్ అవసరాల, సీనియర్ నటి ఈశ్వరి రావు (Eeswari Rao) ముఖ్య పాత్రల్లో దర్శకుడు సాయి కిరణ్ దైదా తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పిండం’ (Pindam ). ఇటీవల మంచి ప్రమోషన్స్ నడుమ మోస్ట్ స్కేరియెస్ట్ సినిమాగా థియేటర్స్ లో విడుదలై థియేటర్ ఆడియన్స్ తో ప్రశంశలు పొందింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కి రాగా ఇక్కడా దూసుకెళుతున్నది.


Pindam.jpg

మొదట ఆహా (aha videoIN)లో మాత్రమే స్ట్రీమింగ్ వచ్చిన ఈ చిత్రం కొన్ని రోజుల తర్వాత అమెజాన్ ప్రైమ్ (Prime VideoIN) లోను స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇంట్లో ఫ్యామిలీ మొత్తం, అన్ని ఏజ్ గ్రూప్స్ కలిసి చూసే విధంగా సినిమా ఉండడంతో థియేటర్లలో మిస్ ఆయిన చాలామంది ప్రేక్షకులు ఫస్ట్ ఆప్సన్ గా ఈ చిత్రాన్నే చూస్తున్నారు. సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కృష్ణ శౌరబ్ సూరంపల్లి సంగీతం అందించగా యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు.

‘పిండం’ సినిమా చూడాలనుకుంటే..

అమెజాన్ లింక్: Click Here

ఆహా లింక్: Click Here

Updated Date - Feb 18 , 2024 | 01:54 PM