Gemini Tv: ఇక‌ ఆడ‌వాళ్ల‌ను ఆప‌డం క‌ష్ట‌మే.. జెమినిలో మెగా సోషియో ఫాంటసీ సీరియల్‌

ABN , Publish Date - Mar 15 , 2024 | 04:28 PM

తెలుగు ప్రేక్షకుల వినోదానికి కేరాఫ్‌ అడ్రస్‌ జెమిని TV . గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్‌ని మనకి అందించిన జెమిని సరికొత్తగా ఓ మెగా సోషియో ఫాంటసీ సీరియల్‌ని ప్రసారం చేయబోతుంది.

Gemini Tv: ఇక‌ ఆడ‌వాళ్ల‌ను ఆప‌డం క‌ష్ట‌మే.. జెమినిలో మెగా సోషియో ఫాంటసీ సీరియల్‌
bhiravi

తెలుగు ప్రేక్షకుల వినోదానికి కేరాఫ్‌ అడ్రస్‌ జెమిని TV Gemini TV). ఎన్నో కార్యక్రమాలు, మరెన్నో అద్భుతమైన సీరియల్స్‌ని మనకి అందించిన జెమిని TV ఇప్పుడు సరికొత్తగా భైరవి (Bhairavi) అనే మెగా సోషియో ఫాంటసీ సీరియల్‌ని మార్చి 18 నుంచి ప్రసారం చేయబోతుంది.

bhiravi.jpeg

ఒక సంపన్న కుటుంబం. ఆ ఇంటి ఇలవేల్పు భైరవీదేవి, అందుకే ఆ ఇంట పుట్టిన ఏకైక ఆడపిల్లకు ఆ దేవి పేరే పెట్టుకుంది.. తల్లి శివగామి. కానీ ఆస్తి కోసం, ఆధిపత్యం కోసం ఆరేళ్ళ భైరవిని అంతం చేశాడు స్వయాన ఆమె చిన్నాన్న ఆది. ఆ తర్వాత శివగామిని పిచ్చిదాన్ని చేసి ప్రపంచాన్ని నమ్మించాడు, ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని తన హస్తగతం చేసుకున్నాడు. ఒక్కో వ్యాపారంలో తన వాళ్ళని ఒక్కొక్కళ్ళనీ పాతుకు పోయేలా చేశాడు. కానీ అతను ఊహించని విధంగా చనిపోయిన భైరవి తిరిగి వచ్చింది.


చనిపోయిన భైరవి (Bhairavi) ఎలా తిరిగి వచ్చింది.. అది ఆ ఇంటి ఇలవేల్పు భైరవి దేవి మహత్యమా? లేక మరేదైనా మాయా? తిరిగి వచ్చిన భైరవిని ఆవహించి ఉన్నది అమ్మవారా, ఆత్మా? తనను తుద ముట్టించి, తన తల్లిని పిచ్చి వాళ్ళను చేసిన వాళ్ళపై భైరవి ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది, తన తల్లి జీవితాన్ని వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా సరిదిద్దింది? అనే సరికొత్త థ్రిల్లింగ్‌ కథతో మెగా సోషియో ఫాంటసీ సీరియల్‌ భైరవి (Bhairavi) ఈ నెల 18 సోమ‌వారం రాత్రి 7 గంటల నుంచి నుంచి టెలీకాస్ట్ కానుంది.

gemini.jpeg

ఈ సీరియల్‌లో ఆకాంక్ష గాంధీ లీడ్ రోల్ చేయ‌గా, బేబీ రచన, భరద్వాజ్‌ కావ్యరెడ్డి, వణపొన్నప్ప, బసవరాజ్‌, రోహిత్‌, డాలీ, శిల్పా గౌడ, రోహిత్‌ నాయర్‌, తదితర నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. మ‌రో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భైరవి (Bhairavi) సీరియల్‌ ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందడంలో ఎలాంటి సందేహం లేదని జెమిని టీవి యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.

Updated Date - Mar 15 , 2024 | 04:28 PM