OTTల్లో ఈ యాక్ష‌న్‌ సినిమాలు డోంట్ మిస్‌.. ఎండింగ్ వ‌ర‌కు దంచుడే దంచుడు

ABN , Publish Date - Apr 30 , 2024 | 06:37 PM

OTTలో యాక్ష‌న్ చిత్రాల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల కోసం కొన్ని ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ సినిమాల వివ‌రాల‌ను మీ ముందుకు తీసుకువ‌స్తున్నాం.

OTTల్లో ఈ యాక్ష‌న్‌ సినిమాలు డోంట్ మిస్‌.. ఎండింగ్ వ‌ర‌కు దంచుడే దంచుడు
ott action movies

ప్ర‌తి వారం ఓటీటీ(OTT)లోకి ఎన్నో సినిమాలు వ‌స్తుంటాయ్ పోతుంటాయ్ అందులో కొన్నింటిని మాత్రమే ప్రేక్ష‌కులు చూస్తుంటారు, గుర్తుంచుకుంటారు. వీటిల్లో ఎక్కువ‌గా క్రైమ్‌, ఇన్వెస్టిగేష‌న్‌, ఫ్యామిలీ జాన‌ర్ చిత్రాలు త‌రుచుగా వ‌స్తుంటాయి. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ సినిమాలు అరుదుగా వ‌స్తుంటాయి. అయితే ఈ యాక్ష‌న్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్న‌ సంగ‌తి కొద్దిమందికి మాత్ర‌మే తెలిసే అవ‌కాశం ఉంటుంది. పైపెచ్చు అన్ని యాక్ష‌న్ జాన‌ర్ చిత్రాల కేట‌గిరీల్లో అన్నీ ఆ త‌ర‌హా చిత్రాలే క‌నిపిస్తూ వీక్ష‌కుల‌ని క‌న్‌ఫ్యూజ‌న్‌లో ప‌డేస్తుంటాయి.

అక్క‌డ ఉన్న సినిమాల్లో ఎందులో మ్యాట‌ర్ అంటే మ‌నం ఉహించిన దాని క‌న్నా యాక్ష‌న్‌ ఉంటుంది.. ఎందులో ఉండ‌దనే విష‌యం తెలియ‌క అక్క‌డ ఉన్న వాటిల్లో ఏదో ఒక చిత్రం చూసేస్తుంటారు. అయితే అలాంటి వారి కోస‌మే కొన్ని ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ సినిమాల వివ‌రాల‌ను మీ ముందుకు తీసుకురావ‌డం జ‌రుగుతుంది. సినీ అభిమానులు త‌మ జీవితంలో త‌ప్ప‌కుండా ఒక్క‌సారైనా చూసి తీరాల‌నుకునే, మ‌నం ఊహించ‌ని ఫైటింగ్ సీక్వెన్స్ ఉండే మోస్ట్ యాక్ష‌న్ అడ్వెంచ‌రస్‌ చిత్రాలు, అవి ఎక్క‌డ స్ట్రీమింగ్ అవుత‌న్న‌ది వివ‌రాలు అంద‌జేస్తున్నాం. ఇక మీకు ఏ మాత్రం స‌మ‌యం దొరికినా ఈ సినిమాల‌ను చూసి ఎంజాయ్ చేయండి.

sisu2.jpg


John Wick (Lionsgate)

‘జాన్ విక్‘ ఈ సినిమా ల‌య‌న్స్‌గేట్ ఓటీటీలో స్రీమింగ్ అవుతున్న‌ది. ఈ చిత్రం మొత్తం నాలుగు భాగాలు ఉండ‌గా అన్నీ త‌ప్ప‌క చూడాల్సిన‌వే.

Sisu Prime Video Rent

‘సిసు‘ నాజీల స‌మ‌యం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రికీ ఫుల్ మీల్స్ ఫీల్‌ను ఇస్తుంది. ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)లో రెంట్ ప‌ద్ద‌తిలో అందుబాటులో ఉంది.

wick2.jpg

Rambo (Lionsgate)

‘రాంబో‘ సినిమా మొత్తం 5 భాగాలు ఉంటుంది. విటీలో అన్నీ మ‌స్ట్ వాచ్ సినిమాలే. ప్ర‌స్తుతం ఈ సినిమాల‌న్నీ ల‌య‌న్స్‌గేట్ (Lionsgate) ఓటీటీలో స్రీమింగ్ అవుతున్నాయి.

Mad Max: Fury Road (Prime Video)

‘మ్యాడ్ మ్యాక్స్‘ ఈ సిరీస్ నాలుగైదు సినిమాలు ఉన్నాయి కానీ Mad Max: Fury Road మాత్రం ఫుల్ యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్‌తో ఉంటుంది. ప్ర‌స్త‌తం అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) లో అందుబాటులో ఉంది.

mad.jpg

The Beekeeper (Lionsgate)

‘ది బీ కీప‌ర్‘.. ఈ సంవ‌త్స‌ర‌మే విడుద‌లైన ఈ చిత్రం ఫుల్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ఉంటుంది. ప్ర‌స్తుతం ల‌య‌న్స్‌గేట్ (Lionsgate) ఓటీటీలో తెలుగులోనూ స్రీమింగ్ అవుతున్న‌ది. డోంట్ మిస్‌.

The Terminator (Prime Video)

‘ది టెర్మినేట‌ర్‌‘.. ఈ సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 6 చిత్రాలు రాగా అన్నీ మ‌స్ట్ వాచ్ చిత్రాలే. ప్ర‌స్తుతం ప్రైమ్ వీడియో (Prime Video) లో కొన్ని ఫ్రీగా, మ‌రికొన్ని రెంట్ ప‌ద్ద‌తిలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

beekeeper.jpg

The Expendables (Lionsgate)

‘ది ఎక్స్‌పెండబుల్స్‘.. ఈసిరీస్‌లో మొత్తం నాలుగు చిత్రాలు రాగా అన్నీ త‌ప్ప‌కు చూడాల్సిన సినిమాలే. ప్ర‌స్తుతం ల‌య‌న్స్‌గేట్ (Lionsgate) ఓటీటీలో అన్నీ అందుబాటులో ఉన్నాయి.

Bullet Train (Prime Video Rent)

‘బుల్లెట్ ట్రైన్‘ 2022లో వ‌చ్చిన ఈ సినిమా టోట‌ల్‌గా ట్రైన్‌లో జ‌రుగుతూ ఫుల్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో థ్రిల్‌ను ఇస్తుంది. ఈ సినిమా ప్రైమ్ వీడియో(Prime Video) లో రెంట్ ప‌ద్దతిలో ఉండ‌గా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.

dont.jpg

DON'T BREATHE (Netflix)

‘డోంట్ బ్రీత్‌‘.. ఓ అంధుడి ఇంట్లో అగంత‌కులు చొర‌బ‌డితే వారిని ఆ అంధుడు ఎలా ఎదుర్కొన్నాడ‌నే పాయింట్‌లో ఫుల్ యాక్ష‌న్‌తో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం రెండు భాగాలు నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Apocalypto (Prime Video)

‘అపొక‌లిఫ్టో‘.. ఈ సినిమా ప్రైమ్ వీడియో (Prime Video) లో ఫ్రీగానే స్ట్రీమింగ్ అవుతుంది. ప్ర‌తి ఒక్క‌రూ మిస్ అవ‌కుండా చూడాల్సిన సినిమాల జాబితాలో అగ్ర స్థానంలో ఉంటుంది.

apocolypto.jpg

Updated Date - Apr 30 , 2024 | 06:37 PM