Miss Perfect : బీచ్‌లో చీపురు ప‌ట్ట‌నున్న‌.. మిస్ పర్ఫెక్ట్

ABN , Publish Date - Jan 26 , 2024 | 10:03 PM

మెగా కోడ‌లు లావ‌ణ్య పులి మేక‌ త‌ర్వాత‌ తాజాగా న‌టించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ . ఈ సిరీస్‌ను జ‌నాల‌లోకి తీసుకెళ్లేందుకు యూనిట్ అంతా వినూత్నంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలో ఆదివారం(28.01.2024) విశాఖ‌ప‌ట్నంలో పరిశుభ్రత దినోత్సవం కార్యక్రమంలో లావ‌ణ్య పాల్గొని బీచ్‌ను శుభ్రం చేయ‌నుంది.

Miss Perfect : బీచ్‌లో చీపురు ప‌ట్ట‌నున్న‌.. మిస్ పర్ఫెక్ట్
miss perfect

మెగా కోడ‌లు లావ‌ణ్య (Lavanya) పులి మేక‌ త‌ర్వాత‌ తాజాగా న‌టించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ (Miss Perfect) . బిగ్‌బాస్ ఫేం అభిజిత్ (Abijeet) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా ఫిబ్ర‌వ‌రి 2 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ (Disney Plus Hotstar)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌ను జ‌నాల‌లోకి తీసుకెళ్లేందుకు యూనిట్ అంతా వినూత్నంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి 30న‌ జాతీయ పరిశుభ్రత దినోత్సవం సంద‌ర్భంగా ఆదివారం(28.01.2024) నాడు విశాఖ‌ప‌ట్నం వైఎంసీఏ దగ్గర నిర్వ‌హించ‌నున్న ఓ కార్యక్రమంలో లావ‌ణ్య ఓ పాల్గొని అక్క‌డ స్థానికులు, కార్మికుల‌తో క‌లిసి బీచ్‌ను శుభ్రం చేయ‌నుంది.

GEgp21pWcAAGzwq.jpeg

ఇదిలాఉండ‌గా త్వ‌ర‌లో ప్ర‌సారం కానున్న ఈ సిరీస్‌లో ఎప్పుడూ పరిశుభ్రత విషయంలో పర్ఫెక్ట్ గా ఉండే మహిళ లావణ్య రావు అనే పాత్రలో ఆమె కనిపించబోతోంది. శుభ్రత అంటే ప్రాణమిచ్చే లావణ్య.. క్లీన్‍నెస్‍ను ఓ మాత్రం పట్టించుకోని అభిజిత్ అనుకోకుండా ప్రేమ‌లో ప‌డతారు. ఈ నేప‌థ్యంలో ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నే అస‌రక్తిక‌ర‌మైన పాయింట్‌తో హ‌స్య భ‌రితంగా ఈ సిరీస్‌ను రూపొందించారు.


జనవరి 22న‌ రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న కూడా ల‌భించింది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ సిరీస్‍ను నిర్మించగా ప్రశాంత్ వి విహారీ సంగీతం అందించారు. లావణ్య త్రిపాఠి, అభిజిత్‍ (Abijeet)తో పాటు అభిజ్ఞ, ఝాన్సీ, హర్షవర్ధన్, మహేశ్ విట్టా, హర్ష్ రోహన్ కీలకపాత్రలు పోషించారు.

Updated Date - Jan 26 , 2024 | 10:03 PM