ఆ దేశాల్లో బ్యాన్ చేసిన సౌత్‌ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో!

ABN , Publish Date - Jan 04 , 2024 | 03:34 PM

మ‌ళ‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి అంటే తెలియ‌ని సౌత్ ఇండియా ప్రేక్ష‌కులు ఉండ‌రు. తాజాగా ఆయ‌న, జ్యోతిక‌ న‌టించిన ఓ వివాదాస్ప‌ద చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

ఆ దేశాల్లో బ్యాన్ చేసిన సౌత్‌ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో!
kaathal the core

మ‌ళ‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి (Mammootty) అంటే తెలియ‌ని సౌత్ ఇండియా ప్రేక్ష‌కులు ఉండ‌రు. త‌న విల‌క్ష‌ణ చిత్రాల‌తో అన్ని భాష‌ల వారికి బాగా ద‌గ్గ‌రైన ఆయ‌న ద‌క్షిణ భార‌త భాష‌ల‌న్నింటిలోనూ న‌టించారు. అంతేకాకుండా మ‌న దేశంలో ప్ర‌తి ఏడాది త‌ను న‌టించిన నాలుగు సినిమాలు విడుద‌ల చేసే ఆగ్ర న‌టుడు కూడా ఆయ‌నే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో ఆయ‌న 2023లో క‌న్నూరు స్కౌడ్‌, క్రిష్టోఫ‌ర్‌, కథల్: ది కోర్ ((Kaathal The Core)), నన్పాకల్ నేరతు మయక్కం అనే నాలుగు సినిమాల్లో న‌టించ‌గా ఆ నాలుగు వేటిక‌వే ప్ర‌త్యేక‌మైన సినిమాలు కావ‌డం విశేషం.

105508637.webp

తాజాగా ఆయ‌న, జ్యోతిక‌ క‌లిసి న‌టించిన ఓ వివాదాస్ప‌ద చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. అదే 2023 డిసెంబ‌ర్‌లో విడుద‌లైన కథల్ ది కోర్ (Kaathal The Core) అనే చిత్రం విడుద‌ల‌కు ముందే తీవ్ర వివాదాల్లో చిక్కు కోవ‌డ‌మే కాక‌ రెండు, మూడు దేశాల్లో బ్యాన్ కూడా చేశారు. మ‌మ్ముట్టి, జ్యోతిక (Jothika) జంట‌గా న‌టించిన ఈ సినిమాకి జో బేబీ దర్శకత్వం వ‌హించ‌గా మ‌మ్ముట్టి (Mammootty)నే త‌న ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌లో నిర్మిచి న‌వంబ‌ర్ 23న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేశారు.హోమో సెక్సువ‌ల్ క‌థాంశంతో వ‌చ్చిన ఈ సినిమాకు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భించ‌డ‌మే కాక కొన్ని ముస్లిం దేశాలు (ఖ‌త‌ర్‌, ఓమ‌న్‌)ల‌ నుంచి తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న‌ను ఎదుర్కొని నిషేదానికి గురైంది. అయిన‌ప్ప‌టికీ ఈ చిత్రం రూ. 150 కోట్లకు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టా బాక్సాఫీస్ వద్ద భారీ విజ‌యాన్ని అందుకున్న‌ది.


ఇక క‌థ విష‌యానికి వ‌స్తే బ్యాంకు మేనేజ‌ర్‌గా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి ఖాళీగా ఉంటున్న‌ హీరో స్థానిక పంచాయితీ ఎన్నిక‌ల్లో స్వ‌తంత అభ్య‌ర్థిగా నిల‌బ‌డేంద‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా ఆయ‌న భార్య నా భ‌ర్త గే అని అత‌ని నుంచి విడాకులు కావాలంటూ కోర్టుకు వెళుతుంది.

106535886.webp

దీంతో షాక్ తిన్న హీరో త‌ర్వాత ఏం చేశాడ‌నే అంశం చుట్టూ రూపొందించ‌బ‌డి ఆద్యంతం కొత్త ర‌కం స్క్రీన్ ప్లేతో ఆక‌ట్టుకుంటుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకు రాగా అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో రెంట్ ప‌ద్ద‌తిలో మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఇండియా మిన‌హా ఇత‌ర దేశాల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది. మ‌రో వారం రోజుల్లో ఇండియాలో స్ట్రీమింగ్ కానుంది.

Updated Date - Jan 04 , 2024 | 03:39 PM