Save The Tigers 2: ఆ జాబితాలో టాప్‌ 3లో నిలిచింది!

ABN , Publish Date - Apr 04 , 2024 | 04:37 PM

చైతన్యకృష్ణ. ప్రియదర్శి, అభినవ్‌ గోమటం కీలక పాత్రధారులుగా మహి వీ రాఘవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ 'సేవ్ ద  టైగర్స్‌ సీజన్‌-2'. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్ట్టార్‌లో  స్ట్రీమింగ్  అవుతోన్న ఈ సిరీస్‌ డిజిటల్‌ వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

Save The Tigers 2: ఆ జాబితాలో టాప్‌ 3లో నిలిచింది!

చైతన్యకృష్ణ. ప్రియదర్శి, అభినవ్‌ గోమటం కీలక పాత్రధారులుగా మహి వీ రాఘవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ 'సేవ్ ద  టైగర్స్‌ సీజన్‌-2' (Save The Tiger 2) డిస్నీ ప్లస్‌ హాట్‌ స్ట్టార్‌లో  (Disney plus Hotstar) స్ట్రీమింగ్  అవుతోన్న ఈ సిరీస్‌ డిజిటల్‌ వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సిరీస్‌కు ఇండియాలోనే టాప్‌-3 ప్లేస్‌ దక్కించుకుంది. ఓటీటీల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన జాబితాలో టాప్‌-3లో నిలిచింది. ఈ విజయం పట్ల మహి వి రాఘవ్‌ సంతోషం వ్యక్తం చేశారు.  



ఈ సందర్భంగా మహి వి.రాఘవ్‌ (Mahi V Raghav) మాట్లాడుతూ "సేవ్‌ ది టైగర్స్‌ సిరీస్‌ను మీరంతా ఆదరించి పెద్ద విజయాన్ని అందించటం చాలా సంతోషంగా ఉంది. రెండు సీజన్స్‌ ఇంత పెద్ద విజయాన్ని సాధించడం సాధారణమైన విషయం కాదు. పెళ్లి, మానవ సంబంధాలను ఆధారంగా చేసుకుని చక్కటి కథలను ఆవిష్కరిస్తే అవి విజయాలను సాధిస్తాయని మరోసారి రుజువైంది. కామెడీ వెబ్‌ షోలను ఫ్యామిలీ చిత్రాలుగా ప్రేక్షకులు భావిస్తారని నమ్మకం కుదిరింది’’ అని పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని అన్నారు.

Save.jpg

'సేవ్‌ ది టైగర్‌ రెండు సీజన్స్‌ సూపర్‌ హిట్‌ కావడంతోసీజన్‌ 3కి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి.  ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్‌ నెల నుంచి సేవ్ ద  టైగర్స్‌ సీజన్‌- 3 సెట్స్‌ పైకి వెళ్లనుంది. ఇదే సందర్భంలో ఔత్సాహిక రచయితలు, ఫిల్మ్‌ మేకర్స్‌ వాకి స్క్రిప్ట్స్ , ఆలోచనలను తమకు పంపాలని మహి వి.రాఘవ్‌ నిర్మాణ సంస్థ త్రీ ఆటమ్‌ లీవ్స్‌ కోరింది. పంపిన ఆలోచనలు, రచనలు బాగుంటే రచయిత, ఫిల్మ్‌ మేకర్స్‌ సహకారంతో దాన్ని మరింత మెరుగ్గా చేసి రూపొందిస్తామని పేర్కొన్నారు.

Updated Date - Apr 04 , 2024 | 04:56 PM