ఈవారం ఓటీటీలో డ‌బ్బింగ్ సినిమాల జాత‌ర‌.. ఏకంగా డ‌జ‌న్ పైనే!

ABN , Publish Date - Jan 12 , 2024 | 02:54 PM

ఈ వారం సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఎన్న‌డులేనంత‌గా థియేట‌ర్ల వ‌ద్ద‌ నాలుగు పెద్ద చిత్రాల జాత‌ర జ‌ర‌గ‌నుండ‌గా అదే లెవ‌ల్‌లో ఓటీటీలోను హ‌లీవుడ్, హిందీ, త‌మిళ‌, మ‌ళ‌యాళ డ‌బ్బింగ్ సినిమాలు, వెబ్ సీరిస్‌ల దండ‌యాత్ర సాగ‌నుంది.

ఈవారం ఓటీటీలో డ‌బ్బింగ్ సినిమాల జాత‌ర‌.. ఏకంగా డ‌జ‌న్ పైనే!
hollywood

ఈ వారం సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఎన్న‌డులేనంత‌గా థియేట‌ర్ల వ‌ద్ద‌ నాలుగు పెద్ద చిత్రాల జాత‌ర జ‌ర‌గ‌నుండ‌గా అదే లెవ‌ల్‌లో ఓటీటీలోను సినిమాల దండ‌యాత్ర సాగ‌నుంది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా డ‌జ‌న‌కు పైగా హ‌లీవుడ్, హిందీ, త‌మిళ‌, మ‌ళ‌యాళ డ‌బ్బింగ్ సినిమాలు,వెబ్ సీరిస్‌లు విడుద‌ల అయ్యాయి. వీటితో పాటు ఆర డ‌జ‌ను స్ట్రైయిట్ తెలుగు చిత్రాలు ఓటీటీల్లోకి వ‌చ్చేశాయి. సో .. ఈ వీకెండ్ మీ కుటుంబ స‌భ్యులు ఈ సినిమాల‌ను చూస్తుపండుగ‌ను,వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి. ఓటీటీల్లో వ‌చ్చిన ఆ సినిమాలేంటో.. ఎందులో వ‌స్తున్నాయో చూసేయండి మ‌రి.

టామ్ క్రూజ్ హాలీవుడ్ భారీ యాక్ష‌న్ చిత్రం మిష‌న్ ఇంఫాజిబుల్ 7 పార్ట్ 1 (Mission Impossible Dead Reckoning Part1) ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)లో ఫ్రీగా అన్ని తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాళ , క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ జ‌రుగుతున్న‌ది.

మార్వెల్ (Marvel Studios) నుంచి వ‌చ్చిన ఎకో (Echo) అనే వెబ్ సిరీస్ ప్ర‌స్తుతం డిస్నీ ప్ల‌స్ (Disney+ Hotstar) హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

జెరెమీ స్ట్రాంగ్, కీరన్ కుల్కిన్ సారా స్నూక్ న‌టించ‌గా హెచ్‌బీవో (HBO Original Series)లో టెలికాస్ట్ అయిన‌ స‌క్సెసెన్ (Succession) అనే అమెరికన్ వ్యంగ్య కామెడీ-డ్రామా టెలివిజన్ సిరీస్‌లోని 4 సీజన్లు ప్ర‌స్తుతం తెలుగు, హిందీ, త‌మిళ‌,క‌న్న‌డ భాష‌ల్లో జియో సినిమా(Jio Cinema)లో ప్ర‌సారం అవుతున్న‌ది.

హాలీవుడ్ స్టార్స్‌ రాచెల్ మక్ఆడమ్స్, సిలియన్ మర్ఫీ, బ్రియాన్ కాక్స్ న‌టించిన అమెరిక‌న్ సైక‌లాజిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ రెడ్ ఐ RedEye (2005) ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ ప‌ద్ద‌తిలో తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లో అందుబాటులోకి వ‌చ్చింది.

అవ‌తార్ హీరో సామ్ వర్తింగ్టన్, కెవిన్ హార్ట్, ఉర్సులా కార్బెరో నటించిన అమెరికన్ హైస్ట్ కామెడీ చిత్రం లిఫ్ట్ (Lift) ప్ర‌స్తుతం (జనవరి 12) నుంచి నెట్‌ఫ్లిక్స్(Netflix) లో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

మెటాలిక్‌రోగ్ (Metallic Rouge) అనే జ‌ప‌నీస్ సైన్స్ ఫిక్ష‌న్‌, థ్రిల్ల‌ర్ యానిమేష‌న్ సీరిస్ ప్ర‌స్తుతం క్రంచీరోల్ (Crunchy roll) ఓటీటీలో తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.


మ‌నోజ్ బాజ్ పాయ్‌, కొంక‌ణా,నాజ‌ర్ న‌టించిన హిందీ డార్క్ కామెడీ సిరీస్ కిల్ల‌ర్ సూప్ (Killer Soup) నెట్‌ఫ్లిక్స్‌లో హిందీతో పాటు తెల‌గులో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

జితేంద్ర కుమార్‌, ర‌ఘుబీర్ యాద‌వ్, నీనా గుప్తా న‌టించిన ఫేమ‌స్‌ హిందీ వెబ్ సిరీస్ పంచాయ‌త్ (Panchayat) సీజన్‌ 3 జ‌న‌వ‌రి 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)లో తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవ‌నుంది.

శ‌ర‌త్ కుమార్‌, ప్ర‌స‌న్న‌, దివ్య‌భార‌తి న‌టించిన త‌మిళ వెబ్ సిరీస్ చేర‌న్ ద‌ర్శ‌క‌త్వం మ‌హించిన‌ జ‌ర్నీ (Journey) సోనీ లివ్ (Sony LIV ) లో తెలుగుతో పాటు, మ‌ళ‌యాళ క‌న్న‌డ భాష‌ల్లో ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

ఆసిఫ్ అలీ, న‌మిత ప్ర‌మోద్ న‌టించిన మ‌ళ‌యాళ‌ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం ఏ రంజిత్ సినిమా (A Ranjith Cinema) ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

రియో ​​రాజ్, మాళవిక న‌టించిన త‌మిళ రోమాంటిక్ డ్రామా చిత్రం జో (Joe) జ‌న‌వ‌రి 15 నుంచి తెలుగుతో పాటు, మ‌ళ‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో Disney+ Hotstar స్ట్రీమింగ్ అవ‌నుంది.

వీటితో పాటు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు కోట బొమ్మాళి (Kotabommali PS) ప్ర‌స్తుతం ఆహ‌(Aha)లో స్ట్రీమింగ్ అవుతుండ‌గా 12 నుంచి జీ 5 (Zee5)లో అజ‌య్‌గాడు (Ajaygadu), 13 నుంచి అహా(Aha)లో కార్తీక్ ర‌త్నం న‌టించిన లింగోచ్చా (Lingoccha), 12 లేదా 13 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ (Hotstar)లో నితిన్‌, శ్రీలీల న‌టించిన ఎక్స్ట్రా ఆర్డిన‌రీ మాన్ (Extra Ordinary Man), వారం క్రిత‌మే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన సింగ‌ర్ సునీత కొడుకు న‌టించిన స‌ర్కారు నౌక‌రి (Sarkaaru Noukari) చిత్రం ప్ర‌స్తుతం (జ‌న‌వ‌రి 12) నుంచి సినిమాలు ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో((Prime Video))లో స్ట్రీమింగ్ అవ‌నున్నాయి.

Updated Date - Jan 12 , 2024 | 02:54 PM