Hit List OTT: ఓటీటీకి వచ్చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్.. డోంట్ మిస్! క్టైమాక్స్ మైండ్‌ బ్లాకే

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:44 PM

ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన డ‌బ్బింగ్ చిత్రం హిట్ లిస్ట్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. విజ‌య్ కనిష్క్ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌గా మ‌రో సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ కుమార్, సితార‌లు ప్ర‌ధాన పాత్రలు పోషించారు.

hit list

ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన ఓ డ‌బ్బింగ్ చిత్రం హిట్ లిస్ట్ (Hit List) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. తెలుగులో వ‌సంతం, చెప్ప‌వే చిరుగాలి వంటి ఫ్యామిలీ డ్రామా సినిమాల‌తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు విక్ర‌మ‌న్ కుమారుడు విజ‌య్ కనిష్క్ (Vijay Kanishka) హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌గా మ‌రో సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ కుమార్ ( R Sarath Kumar), సితార‌లు ప్ర‌ధాన పాత్రలు పోషించారు. ర‌జ‌నీకాంత్‌తో ముత్తు, న‌ర‌సింహా, క‌మ‌ల్‌ హ‌స‌న్‌తో ద‌శావ‌తారం, చిరంజీవితో స్నేహం కోసం, బాలకృష్ణ‌తో జై సింహా, రూల‌ర్ వంటి సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం చేసిన K. S. ర‌వి కుమార్ (K.S.Ravikumar) ఈ సినిమాను నిర్మించారు. సూర్య క‌దిర్ (Soorya Kathir Kakkallar), కార్తికేయ‌న్ (K Karthikeyan) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Hit List

31 మే న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం మొద‌టి రోజే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని హిట్‌గా నిలిచింది. క‌థ విష‌యానికి వ‌స్తే అమ్మ‌, చెల్లితో క‌లిసి విజ‌య్ ప్యామిలీని హ్యాపీగా లీడ్ చేస్తుంటాడు. అయుతే ఓ రోజు అత‌ని త‌ల్లి, చెల్లిని ఓ మాస్క్ ధ‌రించిన మ‌నిషి కిడ్నాప్ చేస్తాడు. వారిని వ‌దిలేయాలంటే త‌ను చెప్పిన మ‌న‌షుల‌ను చంపేయాల‌ని ష‌ర‌తు విధిస్తాడు. దీంతో ఏం చేయాలో తెలియ‌క అ టౌన్‌కు కొత్త‌గా వ‌చ్చిన ఏసీపీని సాయం కోరతాడు. కానీ మాస్క్ మ్యాన్ ఎవ‌రికీ అంతు చిక్క‌కుండా ఉంటూ విజ‌య్‌ను త‌ను చెప్పిన ప‌ని చేయాలంటూ క‌రాఖండీ చెప్పి ఓ గేమ్ స్టార్ట్ చేస్తాడు.


చీమ‌కు సైతం హానీ త‌ల‌పెట్ట‌లేని వ్య‌క్తిగా, భ‌య‌స్తుడిగా, ప్యూర్ వెజిటేరియ‌న్‌గా పేరున్న విజ‌య్ మాస్క్ మ‌నిషి చెప్పిన వ్య‌క్తుల‌ను చంపాడా అనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సినిమా సాగుతుంది. అసలు ఆ మాస్క్ మ్యాన్ ఎవ‌రు, వారిని ఎందుకు చంపమ‌న్నాడు. చివ‌ర‌కు హీరో ఎలా బ‌య‌ట ప‌డ్డాడు, మాస్క్ మ‌నిషిని ప‌ట్టుకున్నారా, బ్యాక్ స్టోరీ ఎంటీ అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌ మ‌ధ్య అద్భుత‌మైన మెసేజ్‌ ఇస్తూ సినిమా న‌డుస్తుంది. యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా అదిరిపోయేలా రూపొందించ‌గా, క్టైమాక్స్ అంత‌కుమించిన ట్విస్ట్‌తో మైండ్ బ్లాక్ చేస్తుంది.

Hit List

ముఖ్యంగా మంచి యూనివ‌ర్స‌ల్ స‌బ్జెక్ట్‌తో, ప్ర‌స్తుత మ‌న‌షుల బిహేవియ‌ర్‌ను టార్గెట్ చేస్తూ వ‌చ్చిన ఈ చిత్రం చివ‌రి వ‌ర‌కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను ఇస్తుంది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో త‌మిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు ఓటీటీలో త‌ప్ప‌క చూసేయండి. మూవీలో ఎలాంటి అస‌భ్య స‌న్నివేశాలు లేవు కుటుంబంతో క‌లిసి హాయిగా చూసేయ‌వ‌చ్చు.

Updated Date - Jul 11 , 2024 | 05:55 PM