Kismat: రెండు ఓటీటీల్లో.. ఇండియా వైడ్‌గా దూసుకుపోతున్న తెలుగు కామెడీ థ్రిల్లర్!

ABN , Publish Date - Apr 04 , 2024 | 05:46 PM

ఫిబ్ర‌వ‌రి 2న థియేటర్లలో విడుద‌లై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కామెడీ థ్రిల్లర్ ’కిస్మత్‌‘. రెండు రోజుల క్రిత‌మే OTTలోకి వ‌చ్చిన ఈ సినిమా ఇక్క‌డ రెట్టింపు ఆద‌ర‌ణ‌తో దూసుకుపోతోంది.

Kismat: రెండు ఓటీటీల్లో.. ఇండియా వైడ్‌గా దూసుకుపోతున్న తెలుగు కామెడీ థ్రిల్లర్!
kismat

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 2న థియేటర్లలో విడుద‌లై ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కామెడీ థ్రిల్లర్ చిత్రం ’కిస్మత్‌‘(Kismat). రెండు రోజుల క్రిత‌మే OTT లోకి వ‌చ్చిన ఈ సినిమా ఇక్క‌డ రెట్టింపు ఆద‌ర‌ణ‌తో దూసుకుపోతోంది. మ‌త్తు వ‌ద‌ల‌రా ఫేమ్‌ న‌రేష్ అగ‌స్త్య (Naresh Agastya ), అభిన‌వ్ గోమ‌టం (Abhinav Gomatam), విశ్వ‌దేవ్ (Vishwadev Rachakonda,) హీరోలుగా న‌టించ‌గా, అవ‌స‌రాల శ్రీనివాస్ (Srinivas Avasarala) కీల‌క పాత్ర‌ పోషించాడు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (Comrade Film Factory)పతాకంపై ఈ కిస్మత్ చిత్రాన్ని రాజు, భాను ప్రసాద్ రెడ్డిలు నిర్మించారు.

GKFei47aoAAXRJA.jpg

క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాతో శ్రీనాథ్ బాదినేని ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల ఆహా (Aha), అమెజాన్ ప్రైమ్ (Prime Video IN) రెండు ఓటీటీల్లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కాదర‌ణ పొందుతోంది. అభిన‌వ్ గోమ‌టం, న‌రేష్ అగ‌స్త్య కామెడీనీ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన రోజే టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎనిమిది సినిమాలు రిలీజ్ అయినా.. కిస్మత్ మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇండియా వైడ్ నెంబర్ 4లో ట్రెండ్ అవుతుండగా.. అహాలోనూ టాప్ లో దూసుకుపోతోంది.


కథ విషయానికి వస్తే.. బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్న ముగ్గరు మిత్రులు ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ చేరుకుటారు. కానీ అప్పటికే సిటీలో ఎలక్షన్ హడావిడి ఉంటుంది. విద్యావేత్తగా పేరున్న అజయ్ ఘోష్ ఎమ్మెల్యేగా నిలబడతాడు.. అదే సమయంలో ఇన్ కంట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్స్ మొదలువుతాయి. దీంతో అజయ్ ఘోష్ తన దగ్గరున్న డబ్బును దాయమని తన వద్ద ఉండే రాజు ,సూరి అనే ఇద్దరు అనుచరులకు ఇస్తాడు.

అయితే రాజు డబ్బును కాజేసి ఓ ప్రాంతంలో దాచి పెడతాడు. ఈ క్రమంలో సూరి చేతిలో చనిపోతాడు. తర్వాత ఆ డబ్బు ఈ ముగ్గురు మిత్రుల చెంతకు చేరుతుంది. తర్వాత వారి జీవితంలో ఎదురైన సంఘటనలతో సినిమా అద్యంతం కామెడీని పంచుతూ చివరి వరకు థ్రిల్లింగ్ గా సాగుతుంది. ఎవరైతే ఈ సినిమాను థియేటర్లలో మిస్సయ్యారో ఇప్పుడు ఇంట్లోనే కుటుంబ సమేతంగా చేసి ఎంజాయ్ చేయవచ్చు.

Updated Date - Apr 04 , 2024 | 05:46 PM