Devara: 'దేవర'.. ఓటీటీకి వ‌చ్చేశాడు! ఫ్యాన్స్‌కు ఇక పండ‌గే

ABN , Publish Date - Nov 08 , 2024 | 05:10 AM

అభిమానులు,రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు చాల‌కాలంగా ఎదురు చూస్తున్న రోజు రానే వ‌చ్చింది. జూ.ఎన్టీఆర్, కొర‌టాల శివ‌ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన దేవ‌ర ఓటీటీ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

devara

జూ.ఎన్టీఆర్ (Jr ntr) , కొరటాల శివ (Koratala Siva) క్రేజీ కాంబినేషన్‌లో 'జనతా గ్యారేజ్‌’ వంటి సూపర్‌హిట్‌ సినిమా త‌ర్వాత తిరిగి క‌లిసి చేసిన చిత్రం దేవర (Devara). ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించ‌డంతో పాటు ప్ర‌ప‌పంచ వ్యాప్తంగా రూ.600కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు రాబ‌ట్టింది. అధిక రేట్లు, నెగిటివ్ టాక్‌ రావ‌డం సినిమాపై ప్రారంభంలో క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం చూపించినప్ప‌టికీ త‌ర్వాత బాగానే పుంజుకుని ఎన్టీఆర్ స్టామినాను నిరూపించ‌డంతో పాటు అప్ప‌టి వ‌ర‌కు రాజ‌మౌళి సినిమా త‌ర్వాత వ‌చ్చే హీరో సెకండ్ సినిమా ఫెయిల్యూర్ త‌ప్ప‌దు అనే కామెంట్ల‌ను బ్రేక్ చేసి మ‌రి స‌క్సెస్ సాధించింది. మూవీ రిలీజై 40 రోజులు దాటిన త‌ర్వాత ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు (Devara OTT ) వ‌చ్చింది.

devara.jpg

కథ: ఎర్ర సముద్రం తీరంలోని రత్నగిరి ప్రాంతంలో నాలుగు గ్రామాలు ఉంటాయి. ఆ నాలుగు గ్రామాల్లో ఒక గ్రామంలో నివశించే దేవర భయానికే భయం పుట్టించేంత వీరుడు. త‌న మాటే శాసనంగా ఉంటుంది. బ్రిటీష్‌ కాలం నాటి చరిత్ర ఆ ఊరికి ఉంటుంది. కాల‌క్ర‌మంలో ఆ ప్రాంత వాసులు త‌మ జీవ‌నోఫాధి కోసం కోస్ట్‌గార్డులకు చిక్కకుండా సముద్ర మార్గంలో అక్రమ రవాణా చేసి డ‌బ్బు సంపాదిస్తూ ఉంటారు. అయితే ఓ రోజు ఆ అక్ర‌మ ర‌వాణా వ‌ల్ల తమ ప్రాంతానికి చెందిన ఓ పిల్లాడి ప్రాణం పోయిందని తెలిసి దేవ‌ర ఆక్ర‌మ ర‌వాణా ప‌నిని బందు చేయాల‌ని నిర్ణ‌యిస్తాడు.

devarajrntrthree.jpg

అందుకు భైర (సైఫ్‌ అలీఖాన్‌) అంగీకరించడు. దేవరను తప్పించి తను సంద్రాన్ని శాసించాలనుకుంటాడు. దాంతో ఇద్దరి మధ్య అంతర యుద్ధం మొదలవుతుంది. దేవర మాత్రం ఊరికి దూరంగా ఉంటూ అక్ర‌మార్కులు సముద్రం ఎక్కాలంటే భయ పడేలా చేస్తాడు. దాంతో దేవర ప్రాణం తీయడానికి పన్నాగం పన్నుతాడు భైర. ఆ తర్వాత ఏం జరిగింది. అజ్ఞాతంలో ఉన్న తండ్రి దేవర కోసం భయం భయంగా ఉండే వర (ఎన్టీఆర్‌) ఏం చేశాడు. చివ‌ర‌కు దేవ‌ర‌ను ఎలా చంపార‌నే ఆస‌క్తిక‌ర క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.


devara-Movie.jpg

జూ.ఎన్టీఆర్ కాస్త గ్యాప్ త‌ర్వాత ఈ సినిమాలో డ్యూయల్‌ రోల్‌ చేసిన చిత్రమిది. ఇందులో దేవరగా తండ్రి పాత్రలో, 'వర’గా యంగ్‌ ఎన్టీఆర్‌ పాత్రలో ఆకట్టుకున్నాడు. జాన్వీకపూర్ (janhvi kapoor) నిడివి తక్కువే అయినా నటనతో ఆకట్టుకుంది. టెక్నికల్‌గా సినిమా ఉన్నతంగా ఉంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌,  ప్రొడక్షన్‌ డిజైన్‌, క్వాలిటీ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. అండర్‌ వాటర్‌ సీన్స్‌కు బాగా ఖర్చు చేసినట్లు తెరపై కనిపిస్తోంది.

Devara.jpg

మొత్తంగా తార‌క్ వ‌న్ మ్యాన్ షో గా సినిమా అసాంతం న‌డుస్తుంది. ఎక్క‌డా బోర్ కొట్ట‌దు. ఒక‌టి రెండు పాట‌లు మిన‌హా ఇంటిల్లిపాది క‌లిసి సినిమా చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఇంకెందుకు ఆల‌స్యం థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, ఎన్టీఆర్‌, జాన్పీ అభిమానులు ఇప్పుడే మ‌రోసారి దేవ‌ర (Devara) సినిమాను చూసేయండి. నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. (Devara OTT )

Updated Date - Nov 08 , 2024 | 05:11 AM