'ఇంటింటి రామాయణం' సీరియల్ శ్రీకర్, పల్లవిల ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్

ABN , Publish Date - Jul 02 , 2024 | 06:07 PM

'ఇంటింటి రామాయణం' సీరియల్ లో నటించిన జంట పల్లవి, శ్రీకర్ ల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ సికంద్రాబాదులోని ఒక ఫంక్షన్ హాల్ లో చేశారు. ఈ సీరియల్ లో వచ్చే వివాహ మహోత్సవ సన్నివేశాలకి ప్రమోట్ చెయ్యడానికి నిజమైన పద్ధతిలో ఆ నటీనటులతో ఇలా ఒక ఈవెంట్ నిర్వహించారు.

'ఇంటింటి రామాయణం' సీరియల్ శ్రీకర్, పల్లవిల ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్
The pre wedding function of Intinti Ramayanam serial couple

స్టార్ మా లో వస్తున్నటీవీ సీరియల్ 'ఇంటింటి రామాయణం' ఇప్పుడు ప్రేక్షకులని బాగా అలరిస్తోంది. ఇందులో నటించిన జంట శ్రీకర్, పల్లవి ల కోసం ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్‌ను స్టార్ మా సికంద్రాబాదులో సిక్కు విలేజ్ లో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసింది.

intintiramayanam.jpg

అక్షయ్, అవని, కుమార్తె ఆరాధ్యతో కలిసి హోస్ట్ చేసిన ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్‌లోని కమ్యూనిటీ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. వచ్చిన ప్రేక్షకులు అందరూ 'ఇంటింటి రామాయణం' నటించిన నటీనటులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. అలాగే ఈ సీరియల్ లో నటించిన వారందరికీ మంచి బహుమతులని ఇచ్చి ఈ సీరియల్ నటీనటులకు స్వాగతం పలికారు ప్రేక్షకులు.

intintiramayanama.jpg

వధూవరులు శ్రీకర్, పల్లవిలు సాయంత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకను చూడటానికి వచ్చిన ప్రేక్షకులు నటీనటులతో ఫోటోలు తీసుకోవడానికి ఆసక్తి కనపరిచారు. అలాగే కొంతమంది గులాబీ పువ్వులను తెచ్చి బహుమతిగా ఇచ్చారు. అదే వేదికపై పల్లవికి ప్రపోజ్ చేయమని శ్రీకర్‌ను అందరూ కోరగా శ్రీకర్ అదే పని చేశారు.

intintiramayanamb.jpg

సాయంత్రం అవని, అక్షయ్, వారి కుమార్తె ఆరాధ్య వధూవరులతో కలిసి దండలు మార్చుకుంటూ నృత్యం చేశారు. స్టార్ మాలో ప్రతి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ లో వివాహ వేడుకల సన్నివేశాలను మిస్ అవొద్దు అని చెపుతున్నారు నిర్వాహకులు. ఎందుకంటే అందులో వస్తున్న ఆ వివాహ మహోత్సవ ఎపిసోడ్ లను ప్రమోట్ చేస్తూ ఈ ఈవెంట్ చెయ్యడం, ఇది ఆదరణ పొందడం ఆసక్తికరం.

Updated Date - Jul 02 , 2024 | 06:07 PM