రెండు OTTల్లోకి రానున్న‌ లేటెస్ట్ హ‌ర్ర‌ర్, కామెడీ థ్రిల్ల‌ర్! ఎప్ప‌టినుంచంటే?

ABN , Publish Date - May 06 , 2024 | 04:08 PM

ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లై విజ‌యం సాధించిన గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది అనే చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్ష‌యింది. 2014లో వ‌చ్చిన గీతాంజ‌లి చిత్రానికి సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది.

రెండు OTTల్లోకి రానున్న‌ లేటెస్ట్ హ‌ర్ర‌ర్, కామెడీ థ్రిల్ల‌ర్! ఎప్ప‌టినుంచంటే?
Geethanjali Malli Vachindi

ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లై విజ‌యం సాధించిన గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది (Geethanjali Malli Vachindi) అనే చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్ష‌యింది. 2014లో అంజ‌లి (Anjali), శ్రీనివాస రెడ్డి (Srinivasa Reddy) ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా వ‌చ్చిన గీతాంజ‌లి చిత్రానికి సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. మొద‌టి భాగంలో న‌టించిన యాక్ట‌ర్సే ఎక్కువ‌గా ఈ సినిమాలో న‌టించ‌గా అంజ‌లికి ఇది 50వ చిత్రం కావ‌డం విశేషం. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి రెడీ అవుతోంది.

ముందుగా ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 10 నుంచి స్ట్రీమింగ్ అవ‌నుందని వారం రోజులుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా.. తాజాగా అహా ఓటీటీలో మే 8 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు ఆహా యాజ‌మాన్యం అధికారికంగా ప్ర‌క‌టించింది. అయితే ఆహాలో ఈ సినిమా విడుద‌లైన కొద్ది రోజుల త‌ర్వాత‌ అమెజాన్ ప్రైమ్‌లోనూ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది. పూర్తిగా కామెడీ, హ‌ర్రర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్ట‌డ‌మే కాక సునీల్‌, స‌త్య‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు క‌డుపుబ్బా న‌వ్వించాయి.

gmv.jpeg


ఇక సినిమా క‌థ విష‌యానిక వ‌స్తే... ఓ సినిమా తీసి మంచి విజ‌యాన్ని అందుకున్న శీను అనే ద‌ర్శ‌కుడు ఆ త‌ర్వాతి చిత్రాలు డిజాస్ట‌ర్ కావ‌డంతో అర్థిక స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంటాడు. అంతేగాక త‌న మిత్రుడిని హీరో చేస్తాన‌ని చెప్పి మోసం చేస్తాడు, అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డ‌డంతో ఇండ‌స్ట్రీకి దూరంగా ఉండాల‌ని డిసైడ్ అవుతాడు. ఈక్ర‌మంలో ఉన్న‌ట్టుండి ఊటీలోని ఓ రిసార్ట్స్ ఓన‌ర్ త‌న‌కు హ‌ర్ర‌ర్ సినిమా తీసి పెట్టాల‌ని కోర‌తాడు అంతేగాక ఈ సినిమాను ఓ హీరోయిన్‌తో, త‌న సొంత‌ మ‌హ‌ల్‌లోనే తీయాల‌ని ష‌ర‌తులు పెడ‌తాడు.

geethanjalimallivachindi.jpg

దీనికి శీను మిత్ర బృందం అంగీక‌రించి ఆ మ‌హ‌ల్‌లో అడుగుపెడ‌తారు. ఇక అప్ప‌టినుంచి వారికి వింత వింత అనుభ‌వాలు ఎదుర‌వుతుంటాయి. అస‌లు అహీరోయిన్‌నే ఎందుకు తీసుకున్నారు, అ మ‌హ‌ల్‌లోనే సినిమా ఎందుకు తీయ‌మ‌న్నారు గీతాంజ‌లి అనే ద‌య్యం (Geethanjali Malli Vachindi) ) మ‌ళ్లీ ఎందుకు వ‌చ్చింద‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతూ ఆధ్యంతం ఆక‌ట్టుకుంటుంది. ఎవ‌రైతే థియేట‌ర్ల‌లో ఈ సినిమాను మిస్స‌య్యారో వారంతా ఓటీటీలో ఎంచ‌క్కా కుటుంబంతో క‌లిసి చూసి ఎంజాయ్ చేయండి.

Updated Date - May 06 , 2024 | 04:17 PM