OTTలో.. మ‌రో మాల్గుడి డేస్‌! మీ బాల్య జ్ఞాప‌కాల‌ను త‌ట్టి లేపే వెబ్ సిరీస్‌.. డోంట్ మిస్‌

ABN , Publish Date - May 19 , 2024 | 04:47 PM

తాజాగా ఓటీటీలోకి వ‌చ్చిన ‘లంపన్’ అనే వెబ్‌ సిరీస్ డిజిట‌ల్ వీక్ష‌కుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. ప్రేక్ష‌కుల‌ను వారిని వారి బాల్యంలోకి తీసుకెళ్లి నాటి వారి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసి ఆనంద‌భాష్పాలు వ‌చ్చేలా చేస్తూ హృద‌యాల‌ను బ‌రువెక్కేలా చేస్తోంది.

OTTలో.. మ‌రో మాల్గుడి డేస్‌! మీ బాల్య జ్ఞాప‌కాల‌ను త‌ట్టి లేపే వెబ్ సిరీస్‌.. డోంట్ మిస్‌
lampan

చాలాకాలం త‌ర్వాత ఓ ఫీల్‌గుడ్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చింది. అయితే ఇది త‌ర‌చూ వ‌చ్చే హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల‌కు చెందినది కాకుండా.. రెగ్యుల‌ర్‌గా వ‌చ్చేక్రైమ్‌, లవ్‌, ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ల‌కు ఏమాత్రం సంబంధం లేని ఓ సింపుల్‌ ఫ్యామిలీ, ఎమోష‌న్ జాన‌ర్‌లో వ‌చ్చిన మ‌రాఠీ వెబ్ సిరీస్ ‘లంపన్’ (Lampan). తాజాగా ఓటీటీలోకి వ‌చ్చిన ఈ సిరీస్ డిజిట‌ల్ వీక్ష‌కుల‌ను తెగ ఆక‌ట్టుకోవ‌డ‌మే కాక వారిని వారి బాల్యంలోకి తీసుకెళ్లి నాటి వారి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసి ఆనంద‌భాష్పాలు వ‌చ్చేలా చేస్తూ హృద‌యాల‌ను బ‌రువెక్కేలా చేస్తోంది. పైగా తెలుగు డ‌బ్బింగ్ అద్భుతంగా కుద‌ర‌డంతో మ‌నం మ‌రాఠీ సిరీస్ చూస్తున్నామ‌నే ఆలోచ‌న ఎక్క‌డా కూడా రాదు. అంత‌లా డ‌బ్బింగ్ సెట్ అయింది.

la.jpg

ప్ర‌ముఖ మ‌రాఠీ ర‌చ‌యిత ప్ర‌కాశ్ నారాయ‌ణ్ సంత్ (Prakash Narayan Sant) ర‌చించిన ప్ర‌ఖ్యాత‌ ‘వ‌న‌వాస్’ అనే బుక్‌లోని ఓ పాత్ర‌తో ఈ సిరీస్ తెర‌కెక్క‌గా ప్రముఖ న‌టుడు,ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు నిపున్ అవినాశ్ ధర్మాధికారి (Nipun Dharmadhikari) డైరెక్ట్ చేశారు. బాల న‌టుడు మిహిర్ గోడ్‍బోలే మెయిన్‌లీడ్‌లో న‌టించ‌గా చంద్రకాంత్ కులకర్ణి (Chandrakant Kulkarni), గీతాంజలి కులకర్ణి (Geetanjali Kulkarni), పుష్కరాజ్ చిర్పుక్టర్ (Pushkaraj Chirputkar), కాదంబరి క‌దమ్ (Kadambari Kadam) ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. సౌరభ్ భలేరావ్ (Saurabh Bhalerao) బ్యా గ్రౌండ్ మ్యూజిక్, రాహుల్ దేశ్‌పాండే సంగీతం అందించారు. ఎలాంటి వ‌ల్గ‌ర్, అసంబ‌ద్ద‌ స‌న్నివేశాలు లేకుండా రూపొందిన ఈ ‘లంపన్’ (Lampan) సిరీస్‌ను ఎంచ‌క్కా ఫ్యామిలీతో క‌లిసి చూసి ఎంజాయ్ చేస్తూ.. నాటి రోజుల‌ను జ్ఞ‌ప్తికి తెచ్చుకోవ‌చ్చు.


GMoUediWIAArqXg.jpeg

క‌థ విష‌యానికి వ‌స్తే.. సిటీలో అమ్మ‌, నాన్న‌, చెల్లి, త‌మ్ముడితో క‌లిసి లంప‌న్‌ ఉంటుంటాడు. అయితే ఊర్లో ఒంట‌రిగా ఉంటున్న అమ్మమ్మ‌, తాత‌య్యల వ‌ద్ద ఉండి చ‌దువుకొమ్మ‌ని చెప్పి లంప‌న్‌ను అమ్మమ్మింటికి పంపిస్తారు. కాగా అమ్మ‌ను విడిచి ఉండ‌డం ఇష్టం లేని లంప‌న్ అక్క‌డి కొత్త‌ పరిస్థితుల‌కు అడ్జ‌స్ట్ కాలేక పోతుంటాడు. కాకుంటే మంచి మిత్రులు ఏర్ప‌డి వారితో స‌ర‌దాగా గ‌డ‌పుతుంటాడు. ఈ క్ర‌మంలో కొన్ని రోజుల త‌ర్వాత లంప‌న్‌కు తీవ్రంగా జ్వ‌రం రావ‌డంతో తిరిగి త‌ల్లిదండ్రుల వ‌ద్దే ఉండేందుకు వెళ‌తాడు. అక్క‌డి వెళ్లాక జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు లంప‌న్‌కు కొత్త ఆలోచ‌న‌లు వ‌చ్చి ఊరి జ్ఞాప‌కాలు వెంటాడుతుంటాయి. చివ‌ర‌కు లంపన్ (Lampan) ఏం చేశాడ‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌తో ఈ సిరీస్ సాగుతుంది.

maxresdefault.jpg

చూడ‌డానికి ఈ ‘లంపన్’ (Lampan) వెబ్ సిరీస్‌ నాటి క్లాసిక్‌ మాల్గుడి డేస్‌ను గుర్తు చేసినా దానికి, దీనికి ఏ మాత్రం సంబంధం ఉండ‌దు. చాలా ప్రెష్‌గా 1950, 60ల‌లో మ‌న తాత‌ల కాలంలో జ‌రిగిన క‌థా నేప‌థ్యంలో ఈ సిరీస్ సాగుతూ మ‌నల్ని వారితో పాటు ప్ర‌యాణించేలా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ పాత్ర‌లు మ‌న చుట్టూనే ఉన్న‌ట్టుగా, ఆ క్యారెక్ట‌ర్స్‌ మ‌న‌వే అన్న‌ట్లుగా చాలా స‌జీవంగా ఉండ‌డ‌మే కాక‌, ఆ సంగీతం, విజువ‌ల్స్‌, ఫొటోగ్ర‌ఫీ అయితే మ‌న‌ల్ని మైమ‌రిపించి అందులో లీన‌మ‌య్యేలా చేస్తాయ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. మొత్తం 7 ఏపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఇప్పుడు సోనీ లీవ్ (Sony LIV) ఓటీటీ (OTT)లో మ‌రాఠీతో పాటు తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది. డోంట్‌ మిస్‌.

Updated Date - May 19 , 2024 | 04:53 PM