మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Heart Beat: ఓటీటీలో దూసుకెళుతున్న.. ‘హార్ట్‌బీట్‌’

ABN, Publish Date - Mar 13 , 2024 | 05:44 PM

ఇటీవల డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న‌ ‘హార్ట్‌బీట్‌’ అనే త‌మిళ‌ వెబ్ సిరీస్ మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో దూసుకెళుతున్న‌ది.

heart beat

ఇటీవల డిస్నీ హాట్‌స్టార్ (Disneyplus Hotstar )లో స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ‘హార్ట్‌బీట్‌’ (HeartBeatOnHotstar) అనే త‌మిళ‌ వెబ్ సిరీస్ మంచి ఆద‌ర‌ణ‌తో దూసుకెళుతున్న‌ది. ఒక ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు, సిబ్బంది చుట్టూ తిరిగే కథతో రొమాన్స్‌,కామెడీ నేప‌థ్యంలో ఆసక్తికరమైన సన్నివేశాల‌తో రూపొందింది. ఏ టెలీ ఫ్యాక్టరీ నిర్మించగా, దీపక్‌ సుందర్‌రాజన్‌ దర్శకత్వం వహించారు. త‌మిళంతో పాటు తెలుగు,హాందీ,క‌న్న‌డ ,మ‌ల‌యాళ భాష‌ల్లోనూ అందుబాటులో ఉంది.


అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ ‘హార్ట్‌బీట్‌’ (HeartBeatOnHotstar) సిరీస్‌లో అనుమోల్‌, దీపా బాలు,యోగలక్ష్మి, థాపా, చారుకేష్‌, రామ్‌,శబరేష్‌, పతినే కుమార్‌, గురు లక్ష్మణ్‌, జయరావు,గిరి, ద్వారకేష్‌, చంద్రశేఖర్‌, దేవీశ్రీ, కవితాలయ కృష్ణన్‌, రియా,స్మైల్‌ సెల్వ, శరవణన్‌ రాజవేల్‌ నటించారు.

Updated Date - Mar 13 , 2024 | 05:44 PM