OTTలోకి.. గోపీచంద్ ఫాంటసీ యాక్ష‌న్ డ్రామా! ఎప్ప‌టినుంచంటే

ABN , Publish Date - Apr 13 , 2024 | 01:06 PM

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు మ‌రో సినిమా రెడీ అవుతోంది. గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది.

OTTలోకి.. గోపీచంద్ ఫాంటసీ యాక్ష‌న్ డ్రామా! ఎప్ప‌టినుంచంటే
Gopichand

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు మ‌రో సినిమా రెడీ అవుతోంది. గోపీచంద్ (Gopichand) హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా (Bhimaa) ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 25వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్( Hotstar) లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజాగా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఈ అనౌన్స్ మెంట్ చేసింది. మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు భీమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు. దర్శకుడు ఎ హర్ష రూపొందించారు.

bhi.jpeg


భీమా చిత్రంలో ప్రియ భవానీ శంకర్ (Bhavani Shankar ), మాళవిక శర్మ (Malvika Sharma)హీరోయిన్స్ గా నటించారు. పవర్ ఫుల్ పోలీస్ కథతో తెరకెక్కిన భీమా సినిమా గత నెల 8వ తేదీన థియేటర్స్ లోకి వచ్చింది. మాస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది భీమా(Bhimaa ). ముఖ్యంగా బి, సి సెంటర్స్ ఆడియెన్స్ ఈ సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లోనూ భీమా సినిమాకు మంచి రెస్పాన్స్ రాబోతోంది.

Updated Date - Apr 13 , 2024 | 01:06 PM