Gaami: గామి పాన్ ఇండియా రికార్డ్‌.. ఓటీటీలో 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:38 PM

విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో న‌ట‌టించిన‌ ‘గామి’ ప్రేక్షకులను అలరిస్తోంది. ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఓటీటీల్లో స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి దూసుకెళ్తోంది.

Gaami: గామి పాన్ ఇండియా రికార్డ్‌.. ఓటీటీలో 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌
gaami

ఇటీవ‌లే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రధానపాత్రలో న‌ట‌టించిన‌ ‘గామి’ (Gaami) ZEE5 ప్రేక్షకులను అలరిస్తోంది. విశ్వక్ సేన్ (Vishwak Sen) ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ‘గామి’ సినిమా తెరకెక్కింది. విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టకుంది. ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోన్న‌ ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి దూసుకెళ్తోంది. డిఫరెంట్ కంటెంట్ ఉన్న ఈ సినిమా ఆడియెన్స్‌ను విశేషంగా అరిస్తోంది. స్ట్రీమింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ ‘గామి’ (Gaami) చిత్రానికి రావటం విశేషం.

‘గామి’ (Gaami) అంటే యాత్రికుడు.. కథ విషయానికి వస్తే .. హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) (Vishwak Sen)వింత సమస్యతో బాధ పడుతుంటాడు. అందుకనే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా శంకర్ తనున్న ప్రదేశాన్ని వీడి తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళతాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలు అని తెలుస్తుంది. అక్కడ 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలు దేరుతాడు.

zees.jpeg


అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి పరిచయం అవుతుంది. ఈ ప్రయాణంలో శంకర్ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, కలలు వస్తుంటాయి. ఓ పల్లెటూరుల్లో ఉండే దేవదాసి ఉమ, ఓ ప్రయోగశాలలో చిక్కుకుని తప్పించుకోవాలనుకునే ఓ యువకుడు కనిపిస్తుంటారు. అసలు వాళ్లకు శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ సమస్య ఏంటి? తన సమస్యకు శంకర్ పరిష్కారం కనుక్కున్నాడా? అనే విషయాలను దర్శకుడు తెరకెక్కించిన తీరు అభినందనీయం.

Gaami.jpg

నరేశ్ కుమార్, స్వీకర్ అగస్తి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపి నందిగాం సినిమాటోగ్రఫీ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. చక్కటి ఎమోషన్స్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందా? అని ఆసక్తికరమైన కథనం, చక్కటి విజువల్స్ అన్ని ప్రేక్షకుడిని కట్టిపడేస్తున్నాయి ఇప్పుడు ఈ విజువల్, ఎమోషనల్ వండర్ జీ5 ద్వారా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది.

Updated Date - Apr 19 , 2024 | 05:38 PM