Dear Nanna: డైరెక్ట్ ఓటీటీలోకి.. ఫాద‌ర్ ఎమోష‌న‌ల్ డ్రామా

ABN , Publish Date - Jun 13 , 2024 | 07:43 PM

చైతన్య రావ్, యష్ణ చౌదరి ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన చిత్రం 'డియర్ నాన్న. దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫాదర్ డే స్పెషల్‌గా జూన్ 14న నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది.

Dear Nanna: డైరెక్ట్ ఓటీటీలోకి.. ఫాద‌ర్ ఎమోష‌న‌ల్ డ్రామా
dear nanna

చైతన్య రావ్ (Chaitanya Rao), యష్ణ చౌదరి ( Yashna Chowdary) ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన చిత్రం 'డియర్ నాన్న (Dear Nanna). సూర్య కుమార్ భగవాన్ దాస్, సంధ్య జనక్, శశాంక్ (Shashank), మధునందన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రాకేష్ మహంకాళి, అంజి సలాది కథనం, మాటలు అందించగా, రాకేష్ మహంకాళి నిర్మాతగానూ వ్యవహరించారు.అంజి సలాది ( anjisaladhi ) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫాదర్ డే స్పెషల్ గా జూన్ 14న నుంచి ఆహా ( ahavideoin) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

GPuNOBMbMAA4Z5e.jpeg

ఇప్పటికే విడుదలైన డియర్ నాన్న ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా బ్యాక్ డ్రాప్, ఫాదర్ ఎమోషన్, చైతన్య రావ్, సూర్య కుమార్ భగవాన్ దాస్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా క్యురియాసిటీని పెంచేస్తాయ‌న్నారు. ప్రొడక్షన్ వాల్యూస్, కంటెంట్ యూనిక్ గా ఉన్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, ముఖ్యంగా ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే సీన్స్ మనసుని హత్తుకుంటాయ‌న్నారు.


WhatsApp Image 2024-06-13 at 7.15.16 PM.jpeg

ఈ ఫాదర్స్ డేకి డియర్ నాన్న (Dear Nanna) పర్ఫెక్ట్ ట్రీట్ అని అన్నారు. ఈ చిత్రంలో సివిఎల్ నరసింహ, ఆదిత్య వరుణ్, వినీల్, సుప్రజ్ ఇతరకీలక పాత్రలు పోహిస్తున్నారు. అనిత్ కుమార్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి గిఫ్టన్ ఎలియాస్ మ్యూజిక్ డైరెక్టర్. శ్రవణ్ కటికనేని ఎడిటర్.

Updated Date - Jun 14 , 2024 | 10:40 AM