మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Atharva: ఓటీటీలో.. సౌత్‌ భాషల్లో ట్రెండ్ అవుతున్న క్రైమ్ థ్రిల్ల‌ర్‌ ‘అథర్వ’

ABN, Publish Date - Feb 20 , 2024 | 06:41 PM

కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరిల కాంబోలో వచ్చిన థ్రిల్లర్ మూవీ అథర్వ. క్లూస్ టీం నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమా ఓటీటీలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ట్రెండ్ అవుతోంది.

atharva

కార్తీక్ రాజు (Karthik Raju), సిమ్రన్ చౌదరి (Simran Choudhary)ల కాంబోలో వచ్చిన థ్రిల్లర్ మూవీ అథర్వ (Atharva). క్లూస్ టీం ఆధ్వర్యంలో ఎన్నో క్రైమ్ కేసులు పరిష్కరించబడతాయి. కానీ ఇది వరకు ఎప్పుడూ కూడా క్లూస్ టీం మీద సినిమా రాలేదు. నేరస్తుడిని పట్టుకునేందుకు వారు చేసే పరిశోధన మీద ఎప్పుడూ ఓ మూవీ రాలేదు. కానీ అథర్వ టీం ఆ కోణంలోనే వచ్చింది. యూనిక్ పాయింట్‌తో వచ్చిన అథర్వ(Atharva)కు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ మంచి స్పందన వస్తోంది.


అథర్వ (Atharva) సినిమాను మహేష్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్ 1న వచ్చిన ఈ చిత్రం థియేటర్లో మంచి సక్సెస్‌ను అందుకున్న ఈ చిత్రం ఆ త‌ర్వాత‌ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25 నుంచి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో (Prime Video)కి స్ట్రీమింగ్‌కు వచ్చింది.

అయితే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చిన‌ప్పటి నుంచి ఈ సినిమా టాప్‌ 10లో ట్రెండ్ అవుతోంది. తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ఈ మూవీ ట్రెండ్ అవుతున్న సందర్భంగా..ఈ చిత్రాన్ని హిందీలోకి డ‌బ్ చేయాల‌ని చిత్ర యూనిట్ చూస్తోంది. ఓటీటీ ఆడియెన్స్ కోసం త్వరలోనే హిందీ భాషలోనూ అథర్వ (Atharva) సినిమా అందుబాటులోకి రానుంది.

Updated Date - Feb 20 , 2024 | 10:03 PM