బిగ్ బాస్ అభిజీత్, లావణ్య త్రిపాఠి 'మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్

ABN , Publish Date - Jan 23 , 2024 | 01:28 PM

నిర్మాత యార్లగడ్డ సుప్రియ కొత్త టాలెంట్ కి ప్రోత్సాహం ఇవ్వడానికి అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున ఎప్పుడూ ముందుంటారని, అందుకే ఇప్పుడు ఈ 'మిస్ పెర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్ తో కొత్త టాలెంట్ ని పరిచయం చేస్తున్నామని చెప్పారు. లావణ్య త్రిపాఠి, అభిజిత్ లీడ్ పెయిర్ గా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ కి విశ్వక్ దర్శకుడు, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది

బిగ్ బాస్ అభిజీత్, లావణ్య త్రిపాఠి 'మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్
The crew and cast of Miss Perfect web series

తెలుగు వెబ్ సిరీస్ లు ఇప్పుడు విరివిగా వస్తున్నాయి. ప్రముఖ నటి లావణ్య త్రిపాఠీ, బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలక పాత్రల్లో పోషించిన 'మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకుడు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో 'మిస్ పర్ఫెక్ట్' స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ని నిన్న విడుదల చేశారు.

ఈ వెబ్ సిరీస్ లో అభిజీత్ మెయిన్ రోల్ చేస్తున్నారు అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను అని చెప్పాడు దర్శకుడు విశ్వక్. 'నేను బిగ్ బాస్ చూడలేదు, కానీ అభిజీత్ చేసిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', మరికొన్ని ప్రాజెక్ట్స్ చూశాను. తను ఆడిషన్ ఇవ్వాల్సిన అవసరం లేకున్నా..ఈ సిరీస్ కోసం ఆడిషన్ ఇచ్చాడు". అని చెప్పాడు దర్శకుడు. ఇందులో లావణ్య గారు లీడ్ రోల్ చేస్తున్నారు అనగానే ఆమె చేసిన 'అందాల రాక్షసి' లో ఆమె పర్ ఫార్మెన్స్ ఎలా ఉందో అలాంటి పర్ ఫార్మెన్స్ ఈ వెబ్ సిరీస్ లో కూడా తీసుకురావాలని అనుకున్నాను. ఈ వెబ్ సిరీస్ మంచి ఎంటర్ టైనర్ అని మాత్రం చెప్పగలను.

missperfectwebseries.jpg

కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడం అంటే నాగార్జున గారికి, నాగేశ్వరరావు గారికి చాలా ఇష్టం. అందుకే అన్నపూర్ణ సంస్థ పెట్టారు. ఈ సంస్థలో చాలా మంది కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చారు. న్యూ టాలెంట్ ను వెలుగులోకి తీసుకురావడమే ఈ సంస్థ ఉద్దేశం. ఇప్పుడు ఈ 'మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్ తో మేము అదే ప్రయత్నం చేశాం, అని చెప్పారు నిర్మాత యార్లగడ్డ సుప్రియ. ఈ జర్నీలో హాట్ స్టార్ చాలా సపోర్ట్ చేసింది. ఈ సిరీస్ కోసం చాలా మంది అమ్మాయిలు నో చెప్పిన క్యారెక్టర్ చేస్తానంటూ ముందుకు వచ్చి తన గట్స్ ఎంటో ప్రూవ్ చేసింది అభిజ్ఞ. బిగ్ బాస్ తో అభిజీత్ తెచ్చుకున్న గుర్తింపు మీకు తెలుసు. ఇందులో తను బాగా పర్ ఫార్మ్ చేశాడు. 'సోగ్గాడే చిన్ని నాయన' టైమ్ నుంచి లావణ్యతో నాకు మంచి స్నేహం ఉంది. మిస్ పర్పెక్ట్ కు తనే పర్పెక్ట్ అనిపించింది. ఒక చిన్న కథలో బలమైన క్యారెక్టర్స్ ఉండి మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరి 2న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో చూడండి, అని చెప్పారు సుప్రియ.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజున మా సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది అని చెప్పారు ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న లావణ్య త్రిపాఠి. 'ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను మిస్ పర్పెక్ట్. సిరీస్ కంప్లీట్ అయ్యేలోపు మిసెస్ పర్పెక్ట్ అయ్యాను. ఈ సిరీస్ కు ముందు నేను చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ కు స్ట్రెస్ ఫీలయ్యాను. అలాంటి టైమ్ లో 'మిస్ పర్ఫెక్ట్' లాంటి ఒక స్క్రిప్ట్ దొరకడం రిలీఫ్ లా ఫీలయ్యాను. శృతి, ఫ్రాన్సిస్ మీ ఇద్దరు సూపర్బ్ స్క్రిప్ట్ ఇచ్చారు. చదువుతున్నంత సేపు ఎంజాయ్ చేశాను. సుప్రియ గారితో 'సోగ్గాడే చిన్ని నాయన' మూవీకి వర్క్ చేశాను. ఆ సినిమా హిట్టయ్యింది. ఈ సిరీస్ కూడా అలాగే బిగ్ సక్సెస్ కావాలి. నాకు హాట్ స్టార్ అంటే చాలా ఇష్టం. సిరీస్, మూవీస్ చూస్తుంటాను', అని చెప్పారు లావైన. టైటిల్ కు తగినట్లే మా 'మిస్ పర్ఫెక్ట్' పర్పెక్ట్ గా ఉంటుంది, అని చెప్పారు లావణ్య.

ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు. పాజిటివ్ ఫీలింగ్ కలుగుతోంది. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట అభిజీత్ ముహూర్తంలో చేశారు. నా లైఫ్ లో ఇది మర్చిపోలేని సందర్భం అనుకుంటా, అని చెప్పాడు ఈ వెబ్ సిరీస్ లో లీడ్ యాక్టర్ గా వేసిన అభిజీత్. 'అన్నపూర్ణ సంస్థలో పనిచేయడం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ స్క్రిప్ట్ బాగా నచ్చింది, మా డైరెక్టర్ విశ్వక్ కు ఆస్ట్రేలియా నుంచి ఫోన్ లో ఆడిషన్ ఇచ్చాను,' అని చెప్పాడు అభిజిత్. దర్శకుడు ఎంత పర్పెక్ట్ అంటే, ఏ సీన్ నచ్చకున్నా బాగా లేదని చెప్పడు. బాగుంది కానీ ఇంకో టేక్ చేద్దాం అంటాడు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వర్క్ చేయించుకున్నారు. లావణ్య గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది, అని చెప్పాడు అభిజిత్.

Updated Date - Jan 23 , 2024 | 01:28 PM