Bhamakalapam2: ఓటీటీలో.. ‘భామా కలాపం 2’ సంచలనం! 5 రోజుల్లో 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్

ABN , Publish Date - Feb 21 , 2024 | 08:18 PM

జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్, కామెడీ చిత్రం 'భామాకలాపం 2. ఇటీవ‌లే డైరెక్ట్ ఓటీటీ ఆహాలో విడుద‌లైన ఈ డైనమిక్ సీక్వెల్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షిస్తూ సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తోంది.

Bhamakalapam2:  ఓటీటీలో..  ‘భామా కలాపం 2’ సంచలనం! 5 రోజుల్లో 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్
Bhamakalapam 2

జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్, కామెడీ చిత్రం 'భామాకలాపం 2 (Bhama kalapam 2). డ్రీమ్ ఫార్మర్స్, ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. సీరత్ కపూర్ (Seerat Kapoor), శరణ్య ప్రదీప్ (Sharanya Pradeep), రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించగా అభిమన్యు తడిమేటి దర్శకత్వం వ‌హించాడు. ఇటీవ‌లే డైరెక్ట్ ఓటీటీ ఆహా (aha videoin)లో విడుద‌లైన ఈ డైనమిక్ సీక్వెల్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షిస్తూ సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తోంది.

Bhama.jpg

మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ రెండో పార్ట్ మీద భారీ స్థాయిలో అంచనాలు ఉండ‌గా.. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పుడు భామా కలాపం 2 (Bhama kalapam 2) ప్రపంచవ్యాప్తంగా ఆదరణను దక్కించుకుంటోంది. ముఖ్యంగా సినిమాలో ప్రియమణి (Priyamani) నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి రివ్యూలు కూడా చాలా పాజిటివ్‌గా వచ్చాయి. చిత్రంలో శరణ్య ప్రదీప్ (Sharanya Pradeep) కామెడీ బాగా పండడంతో ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్, మరీ ముఖ్యంగా గృహిణులు ఎక్కువగా ఈ సినిమాను వీక్షిస్తున్నారు.


ఇదిలాఉండ‌గా ఇటీవ‌లే ఆహా (aha videoin)లోకి వ‌చ్చిన‌ భామాకలాపం 2 (Bhama kalapam 2) రికార్డులను బద్దలు కొట్టేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సొంతం చేసుకుంది. 5 రోజుల్లోనే 10 లక్షల మంది వీక్షించిన‌ట్లు ఆహా అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు సోష‌ల్‌మీడియాలో పోస్టు చేసింది. త్వరలో భామాకలాపం 3 ఉండ‌నున్న‌ట్లు మేకర్స్ ప్రకటించారు.

Updated Date - Feb 21 , 2024 | 08:18 PM