Murder In Mahim: గేలు ఇలా కూడా ఉంటారా.. ఓటీటీలో అదిరిపోయే మ‌ర్డ‌ర్‌ మిస్ట‌రీ!

ABN , Publish Date - May 13 , 2024 | 09:30 PM

రోజురోజు ఓటీటీల్లో చాలా డిఫ‌రెంట్ కంటెంట్ వ‌స్తూ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్‌, థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో వ‌చ్చే సిరీస్‌లైతే వీక్ష‌కుల‌కు ఎన‌లేని వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా ఈ కోవ‌కు చెందినదే ఓ ఆస‌క్తిక‌ర‌మైన సిరీస్ స్రీమింగ్ అవుతోంది.

Murder In Mahim: గేలు ఇలా కూడా ఉంటారా.. ఓటీటీలో అదిరిపోయే మ‌ర్డ‌ర్‌ మిస్ట‌రీ!
Murder In Mahim

రోజురోజు ఓటీటీల్లో చాలా డిఫ‌రెంట్ కంటెంట్ వ‌స్తూ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్‌, థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో వ‌చ్చే సిరీస్‌లైతే వీక్ష‌కుల‌కు ఎన‌లేని వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా ఈ కోవ‌కు చెందినదే ఓ ఆస‌క్తిక‌ర‌మైన సిరీస్ స్రీమింగ్ అవుతోంది. అదే మ‌ర్డ‌ర్ ఇన్ మ‌హీం (Murder In Mahim). విజ‌య్ రాజ్ (Vijay Raaz), అశుతోష్ రాణా (Ashutosh Rana), శివాని ర‌ఘువంశీ (Shivani Raghuvanshi) వంటి న‌టులు మెయిన్ లీడ్స్‌లో న‌టించారు.

12.jpg

అయితే ఈ సిరీస్ ఎప్ప‌టిలా వ‌చ్చే క్రైమ్ థ్రిల్ల‌ర్ మాదిరి కాకుండా.. మ‌న దేశంలో సాంప్ర‌దాయాల‌కు దూర‌మైన‌, ప‌ల‌క‌డానికే ఇబ్బందిప‌డే స్వ‌లింగ సంప‌ర్కుల నేప‌థ్యంలో వ‌చ్చింది. అంతేగాక ఫ‌స్ట్ టైం వారి గురించి పూర్తి స్థాయిలో స్ట‌డీ చేసి మ‌రీ ఈ సిరీస్‌ను తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తోంది. అంతేగాక‌ గే ల విష‌యంలో వారి త‌ల్లిదండ్రులు ప‌డే మ‌నే మ‌నో వేద‌న‌, ప్ర‌భుత్వాలు, సంస్థ‌ల వ్య‌వ‌హార శైలి గురించి కూడా చూపించారు. అంతేగాక ఇలాంటి సంస్కృతి కూడా మ‌న‌దేశంలో ఉందా.. ఉంటుందా అనే అనుమానాలు మ‌న‌కు రావ‌డం ఖాయం. అంత‌లా గేల గురించి క్షుణ్ణంగా ఈ సిరీస్‌లో వివ‌రించారు.


క‌థ విష‌యానికి వ‌స్తే.. మ‌హీం అనే రైల్వే స్టేష‌న్‌లోని టాయిలెట్‌లో ఓ యువ‌కుడిని మ‌ర్డ‌ర్ చేసి కిడ్నీ ఎత్తు కెళ‌తారు. ఈ కేసును శివాజీ రావ్ జెండే అనే పొలీసాఫీస‌ర్ ఇన్వెస్టిగేష‌న్ మొద‌లు పెడ‌తాడు ఈక్ర‌మంలో మ‌రో రెండు మ‌ర్డ‌ర్స్ జ‌రుగుతాయి. దీంతో పోలీసాఫీస‌ర్ కేసు ఎంక్వైరీ కోసం పీట‌ర్ ఫెర్నాండెజ్ అనే రిటైర్ జ‌ర్న‌లిస్టు సాయం తీసుకుంటాడు. ఈ క్ర‌మంలో చ‌నిపోయిన వారంతా గే అనే విష‌యం బ‌య‌ట ప‌డుతుంది. ఇక ఆ త‌ర్వాత కేసు మ‌లుపులు తిరుగుతూ అస‌లు హంత‌కుడెవ‌ర‌నేది అంతుచిక్కకుండా లాస్ట్ వ‌చ్చే సింపుల్ ట్విస్ట్ వ‌ర‌కు ఉహ‌కంద‌ని విధంగా ఉంటుంది. చివ‌ర‌కు జ‌ర్నలిస్టు కుమారుడికి ఈ కేసుకు సంబంధం వంటి ఆస‌క్తిక‌ర‌మైరన క‌థ‌క‌థ‌నాల‌తో సిరీస్ సాగుతూ ఉంటుంది.

mahi.jpg

మొత్తం స్వ‌లింగ సంప‌ర్కుల చుట్టూనే క‌థ‌ సాగుతూ వారికి పాజిటివ్‌గా రూపొందించ‌బ‌డిన ఈ ఒరిజిన‌ల్ సిరీస్ మ‌ర్డ‌ర్ ఇన్ మ‌హీం (Murder In Mahim) జియో సినిమా (Jio Cinema)లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, త‌మిళ‌, మ‌ల‌మాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ అందుబాటులో ఉంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్న‌ ఈ సిరీస్‌లో అక్క‌డ‌క్క‌డ గేకు సంబంధించిన ముద్దులు, ఒక‌టి రెండు స‌న్నివేశాలు కాస్త ఇబ్బందిగా, జుగుప్సగా అనిపించే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఈ సిరీస్‌ను ఫ్యామిలీతో చూడ‌డం కొద్దిగా కష్ట‌మైన ప‌ని.

Updated Date - May 13 , 2024 | 09:30 PM