Lambasingi: విడుద‌లైన 3 వారాల‌కే ఓటీటీలోకి.. న‌క్స‌లైట్ బ్యాక్‌డ్రాప్‌ ల‌వ్‌స్టోరి

ABN , Publish Date - Mar 29 , 2024 | 01:31 PM

భరత్‌రాజ్‌, బిగ్‌బాస్ ఫేం దివి జంటగా నటించిన న‌క్స‌లైట్ బ్యాక్‌డ్రాప్‌ ల‌వ్‌స్టోరి చిత్రం ‘లంబసింగి’. డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

Lambasingi: విడుద‌లైన 3 వారాల‌కే ఓటీటీలోకి.. న‌క్స‌లైట్ బ్యాక్‌డ్రాప్‌ ల‌వ్‌స్టోరి
lambasingi

భరత్‌రాజ్‌(Bharat Raj), బిగ్‌బాస్ ఫేం దివి(Divi) జంటగా నటించిన చిత్రం ‘లంబసింగి’ (Lambasingi). ఇటీవలే థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. నవీన్‌గాంధీ (Naveen gandhi) ఈ సినిమాకు దర్శకత్వం వ‌హించ‌గా సొగ్గాడే చినిన నాయ‌నా, రారండోయ్ వేడుక చూద్దాం, బంగార్రాజు చిత్రాల‌ను రూపొందించిన‌ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ కల్యాణ్‌ కృష్ణ (Kalyan Krishna Kurasala) నిర్మించడం విశేషం.

Lambasingi.jpg

ఇక క‌థ విష‌యానికి వ‌స్తే.. లంబ‌సింగి (Lambasingi) పోలీస్ స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా ప‌నిచేసే వీర‌బాబు అదే ఊర్లో ఉండే న‌ర్సు హరితను ప్రేమిస్తుంటాడు. అమెకు ప‌లుమార్లు త‌న ప్రేమ‌ను చెప్పిన‌ప్ప‌టికీ ఆమె అంగీక‌రించ‌దు. ఓ రోజు వీర‌బాబు డ్యూటీలో ఉన్న స‌మ‌యంలో కొంద‌రు మావోయిస్టులు స్టేష‌న్‌పై దాడి చేస్తారు. అయితే ఆ దాడిలో పాల్గొన్న వారిలో హ‌రిత కూడా ఉండ‌డాన్ని చూసి షాక్ అవుతాడు.


ఆ త‌ర్వాత మావోయిస్టులకు హ‌రితపై అనుమానాలు క‌ల‌గ‌డం, ఆస‌లు ఆమె తండ్రెవ‌రు.. హ‌రిత మావోయిస్టు అని తెలుసుకున్న వీర‌బాబు త‌ర్వాత ఏం చేశాడు, వారు ప్రేమించ‌కున్నారా, వీర‌బాబు ప్రేమ‌ను ఒప్పుకుందా.. చివ‌రికి ఏమైంది అనే ఇంట్రెస్టింగ్ క‌థతో సినిమా సాగుతుంది.

divi.jpeg

అయితే ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లై 20 రోజులు కూడా పూర్తి కాకుకుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది. ఏప్రిల్ 2 నుంచి డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్‌(Disney+ Hotstar)లో స్ట్రీమింగ్ అవ‌నుంది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు ఎంచ‌క్కా ఇంట్లోనే ఇప్పుడు ఈ సినిమాను చూసేయవ‌చ్చు.

Updated Date - Mar 29 , 2024 | 01:31 PM