Masth Shades Unnai Ra: చ‌ప్పుడు లేకుండా.. ఓటీటీలోకి వ‌చ్చేసిన కామెడీ డ్రామా

ABN , Publish Date - Mar 29 , 2024 | 10:28 AM

అభిన‌వ్ గోమ‌టం హీరోగా ఇటీవ‌ల వ‌చ్చిన సినిమా‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా.. ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది.

Masth Shades Unnai Ra: చ‌ప్పుడు లేకుండా.. ఓటీటీలోకి వ‌చ్చేసిన కామెడీ డ్రామా
abhinav

మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా అంటూ ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ సినిమాలోని డైలాగ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు అభిన‌వ్ గోమ‌టం (Abhinav Gomatam). ఆ డైలాగే టెటిల్‌గా అభిన‌వ్ హీరోగా ఇటీవ‌ల సినిమా కూడా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఫిబ్రవరి 23న ఈ సినిమా ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా..!'(Masth Shades Unnai Ra) థియేట‌ర్ల‌లో విడుద‌లగా మిశ్ర‌మ స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. తిరుప‌తి రావు దర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. వైశాలి రాజ్, లావణ్య రెడ్డి క‌థానాయిక‌లుగా న‌టించారు. కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యాన‌ర్‌పై వంశీ నందిపాటి స‌మ‌ర్ప‌ణ‌లో ఆరేం రెడ్డి, ప్రశాంత్, భవాని కాసుల ఈ సినిమాను నిర్మించారు.

268913-shades.webp

ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. ఓ పలెటూరులో నివ‌సించే మనోహర్ (అభినవ్ గోమఠం)కు చిన్న‌ప్ప‌టి నుంచే డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఈ క్ర‌మంలో చ‌దువులో వెన‌క‌బ‌డి ప‌దో త‌ర‌గ‌తితో ఆపేస్తాడు. త‌ర్వాత వాల్ పెయింటింగ్స్ చేస్తు సెటిల‌వుతాడు. దీంతో అత‌నికి పిల్ల‌ను ఇవ్వ‌డానికి ముందుకు రారు. ఓ సంబంధం సెటిల‌వ‌గా పెళ్లిరోజు పెళ్లికూతురు లేచిపోతుంది. ఇలా అడుగ‌డుగునా అవ‌మానాలు ఎదుర్కొంటుంటాడు. దీంతో మిత్రుల సాయంతో అప్పులు చేసి మ‌రి కొత్త‌ ఫ్లెక్స్ ప్రింటింగ్ బిజినెస్ పెడ‌తారు.. కానీ మ‌ధ్య‌లోనే అది నిలిచిపోతుంది.


అదే స‌మ‌యంలో.. మ‌నోహ‌ర్ జీవితంలోకి ఉమా దేవి ఎంట్రీ ఇస్తుంది. అమె ఎవ‌రు అమెకు మ‌నోహ‌ర్‌కు మ‌ధ్య రిలేష‌రన్ ఎంట‌నే ఆస‌క్తిక‌ర‌ క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా ఆద్యంతం కామెడీతో సాగుతూ ఓ మంచి సందేశాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా..!'(Masth Shades Unnai Ra) ఈ రోజు మార్చి 29 (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. థియేట‌ర్ల‌లో సినిమాను మిస్స‌యిన వారు ఇప్పుడే ఈ సినిమాను కుటుంబ‌స‌మేతంగా చూసి హ‌యిగా అస్వాదించొచ్చు.

Updated Date - Mar 29 , 2024 | 10:28 AM