నేను విరాన్‌ని అన్నా అని పిలవాలి.. హీరో విశ్వక్ సేన్! గ్రాండ్‌గా ‘ముఖ్య గమనిక’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ABN , Publish Date - Feb 20 , 2024 | 04:56 PM

విరాన్ ముత్తంశెట్టి హీరోగా లావణ్య హీరోయిన్‌గా వస్తున్న చిత్రం ముఖ్య గమనిక. ఈ సినిమాని ఫిబ్రవరి 23న గ్రాండ్ గా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు.

నేను విరాన్‌ని అన్నా అని పిలవాలి.. హీరో విశ్వక్ సేన్! గ్రాండ్‌గా ‘ముఖ్య గమనిక’ ప్రీ రిలీజ్ ఈవెంట్
Mukhya Gamanika

విరాన్ ముత్తంశెట్టి (Viran Muttamsetty) హీరోగా లావణ్య హీరోయిన్‌గా శివిన్ ప్రొడక్షన్స్ (Shivin Productions) బ్యానర్‌పై రాజశేఖర్ మరియు సాయి కృష్ణ నిర్మాతలుగా కొత్త దర్శకుడు వేణు మురళీధర్. వి (Venu Muralidhar.V) దర్శకత్వంలో వస్తున్న సినిమా ముఖ్య గమనిక (Mukhya Gamanika). ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు, టీజర్ మరియు ట్రైలర్ కు భారీ స్పందన లభిస్తోంది. హీరో విశ్వక్ సేన్ ముఖ్యఅతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాని ఫిబ్రవరి 23న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. విరాన్ నేను జిమ్ ఫ్రెండ్స్. చాలా మంచి వ్యక్తి. వెనక ఎంత బ్యాగ్రౌండ్ ఉన్న తన సొంత కష్టం మీద పైకి రావాలనుకుంటున్నాడు. విరాన్ నన్ను అన్నా అంటాడు కానీ నేను విరాన్ని అన్నా అని పిలవాలి. ఫిబ్రవరి 23న ఈ సినిమా రిలీజ్ అవుతుంది విరాన్ కి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని టీమ్ అందరికీ కూడా పెద్ద విజయం అందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.

GGwEl4AbQAAntox.jpg

డైరెక్టర్ వేణు మురళీధర్ మాట్లాడుతూ.. ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చి మా సినిమాను సపోర్ట్ చేస్తున్న విశ్వక్ సేన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలని, నేను ఇవాళ ఈ పొజిషన్‌లో ఉన్నానంటే కారణం అల్లు అర్జున్ అన్నారు. విరాన్ ముత్తంశెట్టి ఈ సినిమా ఒప్పుకోవడం నా అదృష్టమ‌ని, సమయాన్ని కరెక్ట్ గా పాటించే వ్యక్తి అన్నారు. హీరోయిన్ లావణ్య చాలా బాగా చేసింద‌ని, కిరణ్ మంచి సంగీతం అందించారన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలన్నారు. ఈ సినిమాతో నాకు సపోర్ట్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అని, మమ్మల్ని ఆశీర్వదించాలని ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.


హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ.. ఫిబ్రవరి 23న ఈ సినిమా రిలీజ్ అవుతుందని, ప్రేక్షకులకి నచ్చే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయన్నారు. లవ్ డ్రామా సస్పెన్స్ మంచి మ్యూజిక్ అన్నీ ఉన్నాయని, నాకు హీరోయిన్ గా ఇంతక మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వేణు మురళీధర్, మా ప్రొడక్షన్ టీం శివిన్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్ కి కృతజ్ఞతలని తెలిపింది. విరాన్ చాలా మంచి వ్యక్తి మంచి సపోర్టివ్ అన్నారు. అలాగే ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన విశ్వక్ సేన్ గారికి కృతజ్ఞతలని, ఈ సినిమాని మంచి సక్సెస్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.

F6ITpU3bcAAF9GS.jpg

హీరో విరాన్ ముత్తంశెట్టి మాట్లాడుతూ.. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలని, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వేణు గారికి నా ప్రొడ్యూసర్స్ కి చాలా థ్యాంక్స్ అన్నారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎడిటింగ్ సినిమాటోగ్రఫీ అన్ని చాలా బాగుంటాయని, ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయన్నారు. షూటింగ్లో బిజీ ఉండి కూడా నాకోసం వచ్చారని.. విశ్వక్ అన్నకు చాలా థాంక్స్ అన్నారు. నా వెనకే ఉండి నన్ను సపోర్ట్ చేసే అల్లు అర్జున్ గారికి నా కజిన్ శిరీష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా అన్నారు. మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఇలా మాపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 04:56 PM