Varun Tej: మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా.. కంటెంట్‌ను న‌మ్మి చేసిన సినిమాలా ఉంది

ABN , Publish Date - Feb 21 , 2024 | 07:41 PM

ఈ న‌గ‌రానికి ఏమైంది, మీకు మాత్ర‌మే చెబుతా, సేవ్ టైగ‌ర్ చిత్రాల్లో క‌మెడియ‌న్‌గా పాపులారిటీ సంపాందించుకుని, త‌న‌కంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న న‌టుడు అభిన‌వ్ గోమ‌ఠం. అయితే తాజాగా ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రంలో అత‌ని పాపుల‌ర్ డైలాగ్ మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా టైటిల్‌తోనే అభిన‌వ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది.

Varun Tej: మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా.. కంటెంట్‌ను న‌మ్మి చేసిన సినిమాలా ఉంది
Masthu Shades Unnai Ra

ఈ న‌గ‌రానికి ఏమైంది, మీకు మాత్ర‌మే చెబుతా, సేవ్ టైగ‌ర్ చిత్రాల్లో క‌మెడియ‌న్‌గా పాపులారిటీ సంపాందించుకుని, త‌న‌కంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న న‌టుడు అభిన‌వ్ గోమ‌ఠం (Abhinav Gomatam). అయితే తాజాగా ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రంలో అత‌ని పాపుల‌ర్ డైలాగ్ అయిన మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా (Masthu Shades Unnai Ra) టైటిల్‌తోనే అభిన‌వ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది. వైశాలి రాజ్ (Vaishali Raj) హీరోయిన్‌. కాసుల క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాక‌పంపై తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వంలో భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 23న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

WhatsApp Image 2024-02-21 at 3.32.14 PM.jpeg

మంగ‌ళ‌వారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ ముఖ్య అతిథిగా హాజ‌రై చిత్ర బిగ్ టికెట్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ అభిన‌వ్ (Abhinav Gomatam) తొలిసారిగా లీడ్ రోల్ చేస్తున్నాడు. విభిన్న పాత్రల ద్వారా ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు. ఈ చిత్రంతో అభిన‌వ్‌కు మంచి స‌క్సెస్ రావాల‌ని కోరుకుంటున్నా అన్నారు. కంటెంట్‌ను న‌మ్మి చేసిన సినిమాలా అనిపిస్తుందని, టీమ్ అంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నారన్నారు. అభిన‌వ్‌లో న‌ట‌న ప‌రంగా మంచి షేడ్స్ ఉన్నాయని, చిత్రంలో అన్ని భావోద్వేగాలు ఉన్నాయ‌ని తెల‌సింది. అంద‌రూ ఈ సినిమాను థియేట‌ర్‌లో చూడాల‌ని కోరుకుంటున్నా అన్నారు.


ఈ చిత్రం విజ‌యం సాధించి చిత్ర ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు కూడా మంచి బ్రేక్ రావాల‌ని ఆశిస్తున్నాన అన్నారు. అభిన‌వ్ గోమ‌ఠం (Abhinav Gomatam) మాట్లాడుతూ ఈ వేడుక‌కు వ‌రుణ్‌తేజ్ రావ‌డం ఎంతో హ్య‌పీగా ఉంది. విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ స‌క్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొన‌సాగిస్తున్న వ‌రుణ్‌తేజ్ అంటే నాకు ఎంతో ఇష్టం అన్నారు. ఆయ‌న ఈ వేడుక‌కు రావ‌డం ఎంతో పాజిటివ్ వైబ్ ఉందని, ఈ సినిమా కోసం టీమ్ అంద‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారన్నారు. ఈ సినిమా నా కెరీర్‌లో ఎంతో స్పెష‌ల్ దీని కోసం నా కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, ఈ సినిమాలో న‌టించ‌డం ల‌క్కీగా ఫీల‌వ‌తున్నా అన్నారు. ఈ క‌థ నచ్చి ఈ సినిమా చేశాను. నా సినిమా కంటెంట్ చూడండి. మీకు న‌చ్చితే సినిమా చూడండి. త‌ప్ప‌కుండా అంద‌రి అభిమానంతో సినిమా త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని అనుకుంటున్నా అన్నారు.

GG2J2gcW0AAcSct.jpg

ద‌ర్శ‌కుడు తిరుప‌తి రావు మాట్లాడుతూ ఈ రోజు నేను ఇక్క‌డ ద‌ర్శ‌కుడిగా ఉండ‌టానికి కార‌ణ‌మైన ప్ర‌తి ఒక్క‌రికి థ్యాంక్స్‌. నాకు ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇచ్చిన హీరో, అభిన‌వ్ (Abhinav Gomatam)కు నిర్మాత‌ల‌కు జీవితాంతం బుణ‌ప‌డి ఉంటానన్నారు. అభిన‌వ్ నాకు మొద‌ట్నుంచి ఎంతో స‌పోర్ట్ చేసే వాడు. అంద‌రి స‌హ‌కారంతో సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశామ‌న్నారు. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నా అన్నారు. నిర్మాత‌ల్లో ఒక‌రైన భ‌వాని కాసుల మాట్లాడుతూ సినిమా బాగా వ‌చ్చిందని, సినిమాలోని ప్ర‌తి పాత్ర అంద‌రికి రిలేట్‌గా ఉంటుందన్నారు. ఈ సినిమాకు అన్ని స‌మ‌పాళ్ల‌లో కుదిరాయని, ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే అన్ని అంశాలు ఉన్నాయని, తప్ప‌కుండా చిత్రం విజ‌యం సాధిస్తుందన్నారు. ఈ వేడుక‌లో నిర్మాత‌లు ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వితో పాటు అలీ రైజా, రాధామోహ‌న్‌, కార్తికేయ‌, మెహిన్‌, సంజీవ్‌, లావ‌ణ్య‌, సిద్దార్థ్ స్వయంభూ పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2024 | 07:41 PM