థియేట‌ర్ల‌లో సినిమాల జాత‌ర‌.. ఈ వారం విడుద‌లవుతున్న చిత్రాలివే!

ABN , Publish Date - Feb 22 , 2024 | 03:33 PM

ఫిబ్ర‌వ‌రి 23 శుక్ర‌వారం రోజున థియేటర్ల‌లో సినిమాల దండ‌యాత్ర ఉండ‌నుంది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 20 సినిమాలు వ‌ర‌కు విడుద‌ల కానున్నాయి. వీటిలో తెలుగు చిత్రాలే 11 వ‌ర‌కు ఉండ‌గా హిందీ, ఇంగ్లీష్ క‌లిపి మ‌రో 9 సినిమాలు రిలీజ్ అవ‌నున్నాయి.

థియేట‌ర్ల‌లో సినిమాల జాత‌ర‌.. ఈ వారం విడుద‌లవుతున్న చిత్రాలివే!
theater movies

ఈ వారం ఫిబ్ర‌వ‌రి 23 శుక్ర‌వారం రోజున థియేటర్ల‌లో సినిమాల దండ‌యాత్ర ఉండ‌నుంది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 20 సినిమాలు వ‌ర‌కు విడుద‌ల కానున్నాయి. వీటిలో తెలుగు చిత్రాలే 10 వ‌ర‌కు ఉండ‌గా హిందీ , ఇంగ్లీష్ క‌లిపి మ‌రో 9 సినిమాలు రిలీజ్ అవ‌నున్నాయి. అందులో మూడు పెద్ద చిత్రాలు కాగా మిగ‌తావ‌న్నీ చిన్న చిత్రాలు కాగా రెండు డ‌బ్బింగ్ సినిమాలు ఉన్నాయ్‌.

అయితే శుక్ర‌వారం విడుద‌ల కానున్న చిత్రాల్లో సుంద‌రం మాస్ట‌ర్‌, సిద్ధార్థ రాయ్, మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా వంటివి నాలుగు ప్ర‌ధాన‌ స్టెయిట్ తెలుగు సినిమాలు ఉన్నాయి. వీటిలో పేరున్న న‌టులు న‌టించ‌డంతో వాట‌న్నింటిపై ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలు ఉన్నాయ్‌. వీటితో పాటు మ‌ల‌యాళంలో ఇటీవ‌ల విడుద‌లై మంచి విజ‌యం సాధించిన మ‌మ్ముట్టి న‌టించిన హ‌ర్ర‌ర్ చిత్రం భ్ర‌మ‌యుగం, త‌మిళ స్టార్ హీరో జ‌యం ర‌వి, కీర్తి సురేశ్‌, అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సైర‌న్ వంటి రెండు డ‌బ్బింగ్ చిత్రాలు విడుద‌ల కానున్నాయి.

ఇదిలాఉండ‌గా హిందీలో తెలుగులో ఊస‌ర‌వెల్లి, శ‌క్తి , తుఫాకి సినిమాల‌లో విల‌న్‌గా న‌టించిన బాలీవ‌డ్ న‌టుడు విద్యుత్ జ‌మ్వాల్ న‌టించిన హిందీ స్పోర్ట్స్‌, యాక్ష‌న్, థ్రిల్ల‌ర్ క్రాక్‌, యామీ గౌత‌మ్‌, ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌శ్మీర్ ఆర్టిక‌ల్ స‌మ‌స్య‌పై తెర‌కెక్కించిన ఆర్టిక‌ల్ 370 అనే రెండు పెద్ద చిత్రాలు విడుద‌ల కానున్నాయి. ఇక హాలీవుడ్‌లోనూ తెలుగమ్మాయి అవంతిక వంద‌న‌పు న‌టించిన మీన్ గ‌ర్ల్స్‌2 చిత్రంతో పాటు మ‌రో మూడు ఇంగ్లీష్ చిత్రాలు రిలీజ్ కానున్న‌యి. సో.. సినిమా అభిమానులు మీకు న‌చ్చిన స‌మ‌యాన్ని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి చూసేయండి.


Telugu

Siren (సైర‌న్‌) (Telugu)

Siddharth Roy (సిద్ధార్థ రాయ్‌) Feb 23

roy.jpg

Bramayugam (భ్ర‌మ‌యుగం) Feb 23

Sundaram Master (సుంద‌రం మాస్ట‌ర్‌) Feb 23

Premalo Iddharu (ప్రేమ‌లో ఇద్ద‌రు) Feb 23

14 Days Love (14 డేస్ ల‌వ్‌) Feb 23

Ground (గ్రౌండ్‌) Feb 23

Mukhya Gamanika (ముఖ్య గ‌మ‌నిక‌) Feb 23

Masthu Shades Unnai Raa.. (మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్) రా Feb 23

Mast-Shades-Unnai-Ra-Featured.jpg

Thappinchuku Thiruguvadu Dhanyudu Sumathi

(త‌ప్పించుకు తిరుగువాడు ధ‌న్యుడు సుమ‌తి) Feb 23

Hindi

Article 370 (ఆర్టిక‌ల్ 370) Feb 23

Crakk - Jeetegaa Toh Jiyegaa (క్రాక్‌) Feb 23

crakk-movie-date-cast.webp

All India Rank (ఆల్ ఇండియా ర్యాంక్‌) Feb 23

Chote Nawab (చోటే న‌వాబ్) Feb 23

Qaid No Wayyy Out (క్విడ్ నో వే ఔట్) Feb 23

English

Mean Girls (మీన్ గ‌ర్ల్స్) Feb 23

fb2db077c96e222feed39abe62d75b67.jpg

The Teacher's Lounge (ది టీచ‌ర్స్ లాంజ్‌) Feb 23

A Game of Two Halves (ఏ గేమ్ ఆఫ్ టూ హాల్వ్స్‌)

Demon Slayer: Kimetsu No Yaiba - To The Hashira Training (డెమాన్ స్టేయర్‌) Feb 22

Updated Date - Feb 22 , 2024 | 07:56 PM