అంతరంగాన్ని ఆవిష్కరించేలా...

ABN , Publish Date - May 20 , 2024 | 05:05 AM

దివంగత సినీ గేయ రచయిత, సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రూపొందిన కార్యక్రమం ‘నా ఉచ్ఛ్వాసం కవనం’. సిరివెన్నెల పాటల అంతరంగాన్ని ఆవిష్కరించే ఈ టీవీ షో...

అంతరంగాన్ని ఆవిష్కరించేలా...

దివంగత సినీ గేయ రచయిత, సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రూపొందిన కార్యక్రమం ‘నా ఉచ్ఛ్వాసం కవనం’. సిరివెన్నెల పాటల అంతరంగాన్ని ఆవిష్కరించే ఈ టీవీ షో పరిచయ కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు కృష్ణవంశీ ఈ కార్యక్రమం టీజర్‌ను ఆవిష్కరించారు. సీతారామశాస్త్రిగారి మాట, పాట అందరికీ చేరాలని మేము చేసిన చిన్న ప్రయత్నమే ఈ కార్యక్రమం అని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శ్రీరామ్‌ చెరువు చెప్పారు. ఈ కార్యక్రమంతో శాస్త్రిగారి మాట, పాట విస్తృతంగా ప్రేక్షకుల చెంతకు చేరాలని సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభు ఆకాంక్షించారు.

Updated Date - May 20 , 2024 | 11:27 PM