పురాణపండ ‘మహా సౌందర్యం’పై తిరుమల ప్రధానార్చకుని అనుగ్రహం

ABN , Publish Date - Mar 13 , 2024 | 10:58 PM

తిరుమల శ్రీనివాసుని మంగళ నామ ప్రాణస్పందనతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పవిత్ర హృదయం ఎల్లవేళలా నినదిస్తుందనటానికి ఆయన పరమ పుణ్య గ్రంధాలే సాక్షాత్కరిస్తున్నాయని తిరుమల మహాక్షేత్ర ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు పేర్కొన్నారు.

పురాణపండ ‘మహా సౌందర్యం’పై తిరుమల ప్రధానార్చకుని అనుగ్రహం
A Venu Gopala Deekshithulu and Puranapanda Srinivas

తిరుమల శ్రీనివాసుని మంగళ నామ ప్రాణస్పందనతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) పవిత్ర హృదయం ఎల్లవేళలా నినదిస్తుందనటానికి ఆయన పరమ పుణ్య గ్రంధాలే సాక్షాత్కరిస్తున్నాయని తిరుమల మహాక్షేత్ర ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు (A Venu Gopala Deekshithulu) పేర్కొన్నారు. జాతి ప్రతిష్టకీ, హైందవ గౌరవానికీ , వైదిక సంస్కృతికి సంకేతాలుగా పురాణపండ శ్రీనివాస్ మంగళ గ్రంధాలు చక్కని శబ్దసౌందర్యంతో దర్శనమిస్తాయని వేణుగోపాల దీక్షితులు మంగళశాసనం చేశారు.

ఆపత్కాలంలో శ్రీనివాస్ వెంట దైవీయ స్పృహ రక్షణగా నిలవడంవల్లనే సాత్త్విక , తాత్త్వికతలు పురాణపండ శ్రీనివాస్ చుట్టూ అల్లుకున్నాయని, నిస్వార్ధత మూర్తీభవించిన శ్రీనివాస్ మరిన్ని అద్భుత గ్రంధాలను అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పురాణపండ శ్రీనివాస్ రమణీయ, కమనీయ ‘మహా సౌందర్యం’ (Mahaasoundaryam Book) ఏడవ పునర్ముద్రణను వేణుగోపాల దీక్షితులు ఆవిష్కరించారు.


Srinivas.jpg

ఈ శ్రీకార్యానికి ముందు రచయిత పురాణపండ శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయక మంటపంలో వేదపండితులు పురాణపండ‌ను శ్రీవైష్ణవ సంప్రదాయంలో స్వామివారి ప్రత్యేక వస్త్రాన్ని కప్పి ఆశీర్వదించారు.

Updated Date - Mar 13 , 2024 | 10:58 PM