Chusuko: ఆకట్టుకుంటోన్న త్రిగుణ్, యశస్వి కొండెపూడి.. ‘చూసుకో’ ప్రైవేట్ వీడియో సాంగ్

ABN , Publish Date - Feb 27 , 2024 | 08:26 PM

ప్రైవేట్ ఆల్బమ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్ ఏ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ప్రైవేట్ సాంగ్స్‌ను కూడా సినిమా సాంగ్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా భారీ ఎత్తున రూపొందిస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో ఎన్నో చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో త్రిగుణ్, హీరోయిన్‌ ఆయుషి పటేల్ కలిసి ‘చూసుకో’అనే వీడియో ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Chusuko: ఆకట్టుకుంటోన్న త్రిగుణ్, యశస్వి కొండెపూడి.. ‘చూసుకో’ ప్రైవేట్  వీడియో సాంగ్
chusuko

ప్రైవేట్ ఆల్బమ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్ ఏ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ప్రైవేట్ సాంగ్స్‌ను కూడా సినిమా సాంగ్స్‌కు ఏ మాత్రం తగ్గకుండ భారీ ఎత్తున రూపొందిస్తున్నారు. ఆ రిచ్ చూసి అంతా షాకయ్యేలా ఉంటుంది. స్టార్ హీరోలు సైతం ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ఆకట్టుకుంటున్నారు.

తాజాగా అలాంటి ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో యంగ్ హీరో, హీరోయిన్‌లు మెరిశారు. ఎన్నో చిత్రాలతో ఆకట్టుకున్న త్రిగుణ్ (Thrigun).. 'కలియుగం పట్టణంలో' సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఆయుషి పటేల్ (Aayushi Patell) కలిసి ‘చూసుకో’ (Chusuko) అనే వీడియో ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

a81169fc-cdea-469d-b6c2-352ad8895c3c.jpg

చూసుకో (Chusuko) అంటూ సాగే ఈ పాటను యంగ్ సెన్సేషన్ యశస్వి కొండెపూడి (Yasaswi Kondepudi), హరిణి ఇవటూరి సంయుక్తంగా ఆలపించారు. ఈ పాటకు సురేష్ బాణిశెట్టి సాహిత్యాన్ని అందించగా.. అన్వేష్ రావు కగిటాల బాణీని సమకూర్చారు. చూసుకో అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. కేరళలోని అందమైన విజువల్స్‌ను మరింత అందంగా చూపించారు. త్రిగుణ్ (Thrigun), ఆయుషి (Aayushi Patell) కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.


WhatsApp Image 2024-02-27 at 7.54.20 PM.jpeg

ప్రస్తుతం ఆయుషి పటేల్ (Aayushi Patell) వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మార్చి 22న కలియుగం పట్టణంలో అనే చిత్రంతో ఆయుషి పటేల్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరో మూడు ప్రాజెక్టులు చిత్రీకరణలో ఉన్నాయి. మరో వైపు త్రిగుణ్ (Thrigun) సైతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అచ్చ తెలుగమ్మాయి అయిన ఆయుషి అందాలు ఈ పాటకు ప్రధాన ఆకర్షణ.

Updated Date - Feb 27 , 2024 | 08:28 PM