స్టార్‌డమ్‌ పేరుతో బందీ కాలేను

ABN , Publish Date - Jun 30 , 2024 | 06:39 AM

దక్షిణాదిన అగ్ర హీరోలందరి సరసన కథానాయికగా అలరించిన తమన్నా ఇప్పుడు ప్రత్యేక గీతాల్లోనూ ఆడి పాడుతున్నారు. అలాగే ఓటీటీలో వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నారు. నెగెటివ్‌ పాత్రలకు సైతం సై అంటున్నారు.

స్టార్‌డమ్‌ పేరుతో బందీ కాలేను

దక్షిణాదిన అగ్ర హీరోలందరి సరసన కథానాయికగా అలరించిన తమన్నా ఇప్పుడు ప్రత్యేక గీతాల్లోనూ ఆడి పాడుతున్నారు. అలాగే ఓటీటీలో వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నారు. నెగెటివ్‌ పాత్రలకు సైతం సై అంటున్నారు. దీంతో హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ తగ్గడంతోనే తమన్నా ఐటమ్‌ సాంగ్స్‌ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే తమన్నా మాత్రం వాటిని కొట్టిపారేస్తున్నారు. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయడం తన వల్ల కాదన్నారు. అందుకే కొత్త తరహా పాత్రలు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పుకు అనుగుణంగా కథలు, పాత్రలు ఎంచుకుంటున్నానని తెలిపారు. ‘‘మేస్ట్రో’ చిత్రంలో నెగిటివ్‌ రోల్‌ చేశాను. ఆ పాత్ర బాగా పండింది. ఆ తర్వాత అలాంటి అవకాశాలు మరిన్ని నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. కానీ వాటికి నో చెప్పాను. ఇప్పుడు నటిగా నాలోనూ పరిణతి వచ్చింది. స్టార్‌డమ్‌ పేరుతో బందీగా ఉండలేను. హీరోకు జోడీగా నటించడం అనేది నాకున్న ఎంపికల్లో ఒకటి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. వెబ్‌ సిరీస్‌లు చేసినా, ప్రత్యేక గీతాల్లో నర్తించినా ప్రేక్షకులకు ఇంకా ఏదో కొత్తదనం అందించాలనేదే నా ప్రయత్నం’ అని తమన్నా అన్నారు.

Updated Date - Jul 02 , 2024 | 01:24 AM