Sunny Leone: పారానార్మల్ డిటెక్టివ్‌గా సన్నీ లియోన్.. కథ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

ABN , Publish Date - Feb 28 , 2024 | 04:08 PM

అకీరా డ్రీమ్ క్రియేషన్స్ పతాకం పై యోగేష్, ఆకృతి అగర్వాల్, హీరో హీరోయిన్ గా సన్నీ లియోన్ మరో ప్రధాన పాత్రలో నిర్మితమవుతున్న చిత్రం ' డాక్టర్ యోగి డైరీస్. తాజాగా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది.

Sunny Leone: పారానార్మల్ డిటెక్టివ్‌గా సన్నీ లియోన్.. కథ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
Doctor Yogi Diaries

అకీరా డ్రీమ్ క్రియేషన్స్ పతాకం పై యోగేష్, ఆకృతి అగర్వాల్, హీరో హీరోయిన్ గా సన్నీ లియోన్ మరో ప్రధాన పాత్రలో నిర్మితమవుతున్న చిత్రం ' డాక్టర్ యోగి డైరీస్ (Doctor Yogi Diaries). ఇటీవల ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. పారానార్మల్ థ్రిల్లర్ గా సరికొత్త కథ,కథనాలతో హర్షవర్ధన్, శ్రీదేవి మద్దాలి నిర్మిస్తుండగా, రాజేష్ - ప్రసాద్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమానికి దర్శకులు వీర శంకర్, చంద్ర మహేష్, వి.ఎన్. ఆదిత్య, గవిరెడ్డి శ్రీనివాస్,సూర్యతేజ, గీతా ఆర్ట్స్ అనీష్, వెంకటేష్, ఎన్.ఎస్. గంగాధర్ 99టీవీ గంగాధర్ , తదితరులు హాజరయ్యారు. దర్శకులు వీర శంకర్ క్లాప్ కొట్టగా, వి.ఎన్.ఆదిత్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు, చంద్ర మహేష్ గౌరవ దర్శకత్వం వహించారు.

YOGI.jpeg

నిర్మాత హర్షవర్ధన్, శ్రీదేవి మద్ధాలి మాట్లాడుతూ.. చాలా కాలంగా మంచి కథలకోసం వేట మొదలుపెట్టగా కుదిరిన కథే ఈ డాక్టర్ యోగి డైరీస్ అని, రాజేష్ - ప్రసాద్ లు కథ చెప్పగానే లైవ్ లో ఇలా కూడా జరుగుతుందా అనే ఆశ్యర్యానికి లోనయ్యానని.. అంతలా కథతో ఇంప్రేస్ చేశారన్నారు. మేము కథ చెప్పగానే సన్నీ లియోన్ (Sunny Leone) కూడా చెయ్యటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని భాషలలో సూపర్ హిట్ అయిన సీఐడీ సీరీస్ లో అభిజిత్ గా సుపరిచితమైన ఆదిత్య శ్రీ వాస్తవ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారన్నారు. ఇక పకడ్భందీ ఫ్లానింగ్ తో 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చెయ్యటానికి చూస్తున్నామన్నారు. Rx 100 fame చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారని, ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తైయిందన్నారు.


నటుడు ఆదిత్య శ్రీ వాస్థవ్ మాట్లాడుతూ.. తెలుగులో ఇది నా తొలి సినిమా.. గతంలో తెలుగు నుంచి కొన్ని ఆఫర్స్ వచ్చినా కొన్ని కథ నచ్చకో, డేట్స్ అడ్జెస్ట్ కాక చెయ్యలేక పోయాను. ఇప్పుడు కథ, డేట్స్ రెండు కుదరటం తో డాక్టర్ యోగి డైరీస్ తో మీ ముందుకు వస్తున్నానని, హీరోగా చేస్తున్న యోగేష్ ఖచ్చితంగా పెద్ద హీరోల లిస్ట్ లో చేరతాడన్నారు. హీరో యోగేష్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా అని ఇందులో నేను, సన్నీ లియోన్ (Sunny Leone) డిటెక్టివ్ లు గా చేస్తున్నాం అన్నారు.. డైరెక్టర్స్ రాజేష్ - ప్రసాద్ లు మంచి కథ అందిచ్చారని, ప్రొడ్యూసర్స్ కాంప్రమైజ్ కాకుండా కాస్టింగ్, టెక్నీషియన్స్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. ముట్టా రాజేందర్, ఆదిత్య శ్రీ వాస్తవ్, నాజర్ , ప్రవీణ్ లాంటి పెద్ద నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. 2024 లో ఒక మంచి పరానార్మల్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను అలరిస్తామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను అని అన్నారు.

YOGII.jpeg

సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ మాట్లాడుతూ.. RX 100 తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో ఒక కొత్త కథ ఈ డాక్టర్ యోగి డైరీస్ (Doctor Yogi Diaries) ఉంటుందని, పారానర్మల్ థ్రిల్లర్ ఇది. ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉంటాయని ముఖ్యంగా సన్నీలియోన్ ఉన్న పాట సినిమాకి హైలైట్ అవుతుందని అన్నారు. డైరెక్టర్స్ స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారని అతెలిపారు.

YOGIII.jpeg

దర్శకులు రాజేష్ - ప్రసాద్ లు మాట్లాడుతూ.. కథని నమ్మి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన నిర్మాతలు హర్షవర్ధన్, శ్రీదేవి గారికి ధన్యవాదాలు. Dop గా ప్రభాకర్ రెడ్డి సపోర్ట్ చాలా బాగుందని, హీరో యోగేష్ , సన్నీలియోన్ , ఆదిత్య శ్రీ వాస్తవ్, మరో హీరోయిన్ ఆకృతి అగర్వాల్ లు సినిమా కి అస్సెట్ గా నిలుస్తారన్నారు. Rx 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం , కథనం ఫ్రెష్ గా ఉంటుంని చెప్పారు.

Updated Date - Feb 28 , 2024 | 06:31 PM