Singer Geetha Madhuri: అందం కోసం అక్కడికి వెళ్లాల్సిందేనట..

ABN , Publish Date - Jan 01 , 2024 | 09:16 PM

నూతన సంవత్సరం సందర్భంగా ఎస్తటిక్‌ అండ్‌ కాస్మటాలజి ‘లాఫ్లోర్‌’ క్లినిక్‌ని డాక్టర్‌ మృణాళిని యూసఫ్‌గూడలో నెలకొల్పడం ఆనందంగా ఉంది. ఆమె నాకు చక్కని స్నేహితురాలు, ఈ క్లినిక్‌ని న్యూ ఇయర్‌ రోజున నా చేతులతో ప్రారంభించటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ప్రముఖ గాయని గీతామాధురి.

Singer Geetha Madhuri: అందం కోసం అక్కడికి వెళ్లాల్సిందేనట..

నూతన సంవత్సరం సందర్భంగా ఎస్తటిక్‌ అండ్‌ కాస్మటాలజి ‘లాఫ్లోర్‌’ క్లినిక్‌ని డాక్టర్‌ మృణాళిని యూసఫ్‌గూడలో నెలకొల్పడం ఆనందంగా ఉంది. ఆమె నాకు చక్కని స్నేహితురాలు, ఈ క్లినిక్‌ని న్యూ ఇయర్‌ రోజున నా చేతులతో ప్రారంభించటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ప్రముఖ గాయని గీతామాధురి. సోషల్‌ మీడియాలో నటిగా, యాంకర్‌గా, ఇన్‌స్టా రీల్స్‌ ద్వారా బెజవాడ బేబక్కగా ఫేమస్‌ అయిన మధు ఎక్విప్‌మెంట్‌ రూమ్‌ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా గీతామాధురి మాట్లాడుతూ ‘‘ఈ రోజుల్లో అందంగా ఉండటం నిత్యవసరం అయిపోయింది. అందంలో భాగమైన ట్రీట్‌మెంట్స్‌ యాంటీ ఏజింగ్, ప్రీమియమ్‌ ఫేషియల్స్, సెమీ పర్మినెంట్‌ మేకప్, లేజర్‌ ట్రీట్‌మెంట్, స్కిన్‌ పీల్స్, స్లిమ్మింగ్‌ ట్రీట్‌మెంట్స్‌ ఇక్కడ స్పెషల్‌గా ట్రీట్‌ చేస్తారు. ఇవేకాకుండా ప్లాస్టిక్‌ సర్జన్‌ ప్రొసీజర్స్, కాస్మెటిక్‌ గైనకాలజి ప్రొసీజర్స్, హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ తదితర ట్రీట్‌మెంట్స్‌ను వీరు అందించనున్నారు’’ అని తెలిపారు.

బెజవాడ బేబక్క మధు మాట్లాడుతూ.. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్‌ చూస్తుంటే ఓ నెలరోజుల పాటు ఇక్కడే ఉండి బాడీకి సంబంధించిన అనేక రకాల ట్రీట్‌మెంట్‌లు తీసుకోవాలనుంది. అలాగే డాక్టర్‌ మృణాలిని గారు ప్రతి ఒక్క పేషెంట్‌తో పర్సనల్‌గా ఇంటరాక్ట్‌ అవ్వటం చూస్తుంటే మంచి హోమ్‌లీ ఫీలింగ్‌ కలిగిందని అన్నారు. డాక్టర్‌ మృణాలిని మాట్లాడుతూ– ‘‘ నేను ఈ క్లినిక్‌ను పెట్టిన కారణం ఏంటంటే మోస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ మిషనరీతో అందరికి అందుబాటులో అందం ఉండాలి అనే మోటోతో లాఫ్లోర్‌ని ప్రారంభించాను. క్లినిక్‌ని ప్రారంభించిన నా ఫ్రెండ్‌ గీతామాధురికి, మధుకి థ్యాంక్ప్‌’’ అని చెప్పారు.

Updated Date - May 04 , 2024 | 08:38 PM