ప్రేమికుల రోజు.. ‘జస్ట్ ఎ మినిట్’ లవ్ సాంగ్ రిలీజ్

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:27 PM

అభిషేక్ పచ్చిపాల , నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ‘జస్ట్ ఎ మినిట్. తాజాగా ప్రేమికుల రోజును పుర‌స్క‌రించ‌కుని ఈ సినిమా నుంచి నువ్వంటే ఇష్టం అంటు సాగే రెండో పాట‌ను రిలీజ్ చేశారు.

ప్రేమికుల రోజు.. ‘జస్ట్ ఎ మినిట్’ లవ్ సాంగ్ రిలీజ్
Just A Minute

అభిషేక్ పచ్చిపాల , నజియ ఖాన్ (Naziya Khan), జబర్దస్త్ ఫణి మరియు సతీష్ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ‘జస్ట్ ఎ మినిట్’ (Just A Minute) రెడ్ స్వాన్ ఎంటర్టై్మెంట్ మరియు కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ బ్యానర్లపై అర్షద్ తన్వీర్ (Arshad Tanveer) మరియు డా. ప్రకాష్ ధర్మపురి (prakash dharmapuri) నిర్మాతలుగా వ్యవహరించగా, పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఈ రోజు నువ్వంటే ఇష్టం (Nuvvuanteistam) అంటు సాగే రెండో పాట‌ను రిలీజ్ చేశారు.

WhatsApp Image 2024-02-13 at 3.10.29 PM.jpeg

ఈ సందర్భంగా దర్శకుడు పూర్ణస్ యశ్వంత్ మాట్లాడుతూ గతంలో మేం విడుద‌ల చేసిన‌ చేసిన ఫస్ట్-లుక్‌, టీజర్‌ల‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని, టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉందంటూ మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్నిస్తోందన్నారు. అతి త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నామ‌ని, అందులో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ రివీల్ అవుతాయన్నారు.


WhatsApp Image 2024-02-13 at 3.10.30 PM.jpeg

గతంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన హేమంత్ ఈ పాట‌ పాడడం చాలా ప్లస్ అయ్యిందని, రాంబాబు గోసాల (Rambabu Gosala) సాహిత్యం యువతని ఎంతగానో అలరిస్తుందన్నారు.ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ.. ఫస్ట్-లుక్, టీజర్‌కి వస్తున్న ఆదరణ మాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. ఇలాగే ప్రేక్షకుల ఆదరణ మా "జస్ట్ ఎ మినిట్ " సినిమా పైన, మా పైన ఉండాలని.. సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 03:27 PM