Roti Kapda Romance: రోటి క‌ప‌డా రొమాన్స్.. రిలీజ్ డేట్ ఫిక్స్

ABN , Publish Date - Feb 21 , 2024 | 08:41 PM

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’.

Roti Kapda Romance: రోటి క‌ప‌డా రొమాన్స్.. రిలీజ్ డేట్ ఫిక్స్
Roti Kapda Romance

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా (Lucky Media) అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా (Harsha Narra), సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష (Nuveksha), మేఘలేఖ, ఖుష్బూ చౌదరి (Khushboo Choudhary) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి (Vikram reddy) దర్శకుడు.


ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డోస్ (టీజ‌ర్‌)కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది.సెకండ్‌డోస్ లో భాగంగా విడుద‌ల చేసిన ఈ సినిమాలోని అరెరె.. అరెరె అనే లిరిక‌ల్ వీడియోకు మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం విడుద‌ల తేదిని ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. మార్చి 22న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ న‌లుగురు స్నేహితుల క‌థ ఇది. వారి స్నేహం, ప్రేమ‌, వారి లైఫ్ జ‌ర్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నేటి యువ‌త‌రాన్ని అమితంగా ఆక‌ట్టుకునే ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో కుటుంబ ప్రేక్ష‌కుల‌ను అల‌రించే భావోద్వేగాలు కూడా ఉన్నాయి. అభిరుచి గ‌ల నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌తో క‌లిసి సృజన్‌ కుమార్ బొజ్జం ఈ చిత్రాన్ని ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించారు. త‌ప్ప‌కుండా ఈ చిత్రం యూత్‌కు ఓ ఫెస్ట్‌లా ఉంటుంది అన్నారు.

Updated Date - Feb 21 , 2024 | 08:41 PM