Poonam Kaur: పలుకుబడి ఉంది కాబట్టి.. ప్రభుత్వం అతన్ని  ఏం చేయలేదు!

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:35 AM

నటి పూనమ్‌ కౌర్‌ (Poonam kaur) తాజాగా ఒక సంచలన వీడియో సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. కన్నడ నాట మత్రమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna) గురించి ఆమె ఓ వీడియో విడుదల చేసింది.

Poonam Kaur:  పలుకుబడి ఉంది కాబట్టి.. ప్రభుత్వం అతన్ని  ఏం చేయలేదు!

నటి పూనమ్‌ కౌర్‌ (Poonam kaur) తాజాగా ఒక సంచలన వీడియో సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. కన్నడ నాట మత్రమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna) గురించి ఆమె ఓ వీడియో విడుదల చేసింది. కర్ణాటకలో సెక్యులర్‌ జనతాదళ్‌ పార్టీకి చెందిన మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ హాసన్‌ ప్రాంతానికి ఎంపీగా ఉన్నారు. కర్ణాటకలో జరిగిన తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అదే నియోజకవర్గంలో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది ఆ పార్టీ. ఇదే సమయంలో దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించిన అసభ్యకర వీడియోలు బయటకు వచ్చి జనాల్ని షాక్‌కి గురి చేశారు. ప్రజ్వల్‌ రేవణ్ణ అమ్మాయిలతో ఉల్లాసంగా గడిపిన అసభ్యకర (Sex videos) వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏప్రిల్‌ 26న హాసన్‌ నియోజకవర్గానికి (hassan lok sabha constituency) పోలింగ్‌ జరిగిన రోజు నుంచి ఈ వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

Prajwal.jpg

అలాంటి వ్యక్తికి ఓటేస్తారా? అనే క్యాప్షన్స్‌తో ఈ అశ్లీల వీడియోలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఈ వీడియోల కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్ఘ్రభుత్వం నిర్ణయించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్థరామయ్య ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో రేవణ్ణపై మహిళలను బెదిరించి లైంగికంగా వేధించడం తోపాటు అసభ్యకర వీడియోలు తీయడంపై ఫిర్యాదు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రజ్వల్‌ రేవణ్ణ జర్మనీ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా పూనమ్‌ కౌర్‌ ప్రజ్వల్‌ రేవణ్ణ వీడియోల గురించి ఓ పోస్ట్‌ చేసింది. అందులో, 2800 మందికి పైగా మహిళలను బెదిరించి లైంగికంగా వేధింపులకు గురి చేసి అసభ్యకర వీడియోలు తీసిన రేవణ్ణ.. ఇప్పుడు జర్మనీకి పారిపోయాడని ఆమె పేర్కున్నారు. అతనికి డబ్బు, పలుకుబడి ఉంది, అందుకే ఈ ప్రభుత్వం అతన్ని ఏమీ చేయలేదు. అందుకే ఆటను వెళ్లి జర్మనీలో కూర్చున్నాడు’’ అని కామెంట్‌ చేశారు. ప్రస్తుతం ఆమె వీడియో వైరల్‌ అవుతోంది.

Updated Date - Apr 30 , 2024 | 11:35 AM