ఇండియన్‌ నేటివిటీతో పోకెమాన్‌

ABN , Publish Date - May 18 , 2024 | 05:52 AM

పిల్లలను అమితంగా ఆకర్షించిన యానిమేషన్‌ సిరీ్‌సల్లో ‘పొకెమాన్‌’కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు ‘పోకెమాన్‌ హారిజన్స్‌’ పేరుతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇండియన్‌ నేటివిటీతో పోకెమాన్‌

పిల్లలను అమితంగా ఆకర్షించిన యానిమేషన్‌ సిరీ్‌సల్లో ‘పొకెమాన్‌’కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు ‘పోకెమాన్‌ హారిజన్స్‌’ పేరుతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సిరీ్‌సలో ప్రీమియర్‌ ఎపిసోడ్‌ను హంగామా టీవీలో ఈ నెల 25న స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. భారతీయ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందించినట్లు మేకర్స్‌ తెలిపారు. కథలో ఇక్కడి నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేయడంతో పాటు పలువురు ఇండియన్‌ ఆర్టి్‌స్టలు మేకింగ్‌లో భాగమయ్యారు. ప్రముఖ సంగీత దర్శకులు విశాల్‌ - శేఖర్‌ సంగీతం అందించగా గాయకులు అర్మాన్‌ మాలిక్‌, హీరోయిన్‌ షిర్లే సేటియా ఇందులోని పాత్రలకు తమ గొంతును అందించారు. ‘చిన్నప్పుడు పోకెమాన్‌ టాయ్స్‌ కలెక్ట్‌ చేశాను. ఇప్పుడు ఈ సిరీ్‌సలోని పాత్రలకు డబ్బింగ్‌ చెప్పడం మర్చిపోలేని అనుభవం’ అన్నారు షిర్లే సేటియా.

Updated Date - May 18 , 2024 | 10:02 AM