ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో.. పికిల్ బాల్ కోర్ట్ ప్రారంభం

ABN , Publish Date - May 17 , 2024 | 12:32 PM

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో నూతనంగా పికిల్ బాల్ కోర్ట్ ఓపెనింగ్ ఘనంగా జరిగింది. వి. సూరన్న ( సినీ ఆర్ట్ డైరెక్టర్) మెమోరియల్ పికిల్ బాల్ కోర్ట్ గా పేరు పెట్టి నేడు ఓపెన్ చేశారు.

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో.. పికిల్ బాల్ కోర్ట్ ప్రారంభం
FNCC

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో నూతనంగా పికిల్ బాల్ కోర్ట్ ఓపెనింగ్ ఘనంగా జరిగింది. వి. సూరన్న ( సినీ ఆర్ట్ డైరెక్టర్) మెమోరియల్ పికిల్ బాల్ కోర్ట్ గా పేరు పెట్టి నేడు ఓపెన్ చేశారు. FNCC లో యాక్టివిటీస్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు ఈ పికిల్ బాల్ కోర్ట్ ఓపెనింగ్ తో ఇంకా ముందు ముందు మరిన్ని టోర్నమెంట్స్, ఆక్టివిటీస్ ఏర్పాటు చేయనున్నారు.

096c5137-ce65-416b-b73b-38da900f6cb4.jpeg


ఈ పికిల్ బాల్ కోర్ట్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథులుగా సినీ దర్శకులు పి. సాంబశివరావు, FNCC ఫార్మర్ ప్రెసిడెంట్ డా. కేఎల్. నారాయణ, ఆనంద్ సినీ సర్వీస్ పి. కిరణ్ పాల్గొన్నారు.

FNCC.jpg

వీరితోపాటు FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, సెక్రటరీ ముళ్లపూడి మోహన్, ట్రెజరర్ రాజశేఖర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు, మరియు కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, శ్రీమతి శైలజ జూజల, ఎ.గోపాలరావు, ఏడిద సతీష్ (రాజా), సామ ఇంద్రపాల్ రెడ్డి, డోనర్ వి. నిరంజన్ బాబు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2024 | 12:32 PM