గుడి కోసం ఎన్టీఆర్‌ విరాళం

ABN , Publish Date - May 16 , 2024 | 05:28 AM

చిన్న సాయం చేసి ఆ విషయం ఊరంతా చాటుకుంటున్న రోజులివి. కానీ ఓ మంచి పని కోసం లక్షల రూపాయల విరాళం ఇచ్చి కూడా ఆ విషయం ఎక్కడా ఎవరికీ చెప్పకుండా మౌనంగా వహించి...

గుడి కోసం ఎన్టీఆర్‌ విరాళం

చిన్న సాయం చేసి ఆ విషయం ఊరంతా చాటుకుంటున్న రోజులివి. కానీ ఓ మంచి పని కోసం లక్షల రూపాయల విరాళం ఇచ్చి కూడా ఆ విషయం ఎక్కడా ఎవరికీ చెప్పకుండా మౌనంగా వహించి తన ప్రత్యేకత మరోసారి చాటుకున్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌. విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్న పేటలో ఉన్న వీరభద్రస్వామి దేవాలయానికి ఎన్టీఆర్‌ రూ. 12.50 లక్షల విరాళం ఇచ్చారు. ఇది ఎప్పుడు ఇచ్చారో కూడా ఎవరికీ తెలీదు. చిన్న ఊరు, చిన్న గుడి కావడంతో ఈ విషయం బయటకు కూడా రాలేదు. అయితే ఇటీవల ఎవరో ఆ గుడికి వెళ్లి అక్కడున్న శిలా ఫలకం మీద జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరు చూసి ఆ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అందరికీ తెలిసింది. ఎన్టీఆర్‌ మంచి మనసుకి ఫిదా అయిన నెటిజన్లు ఆయనకు అభినందనలు తెలుపుతూ కామెంట్స్‌ పెడుతున్నారు.

Updated Date - May 16 , 2024 | 12:43 PM