రాజ్‌ తరుణ్‌కు నోటీసులు ?

ABN , Publish Date - Jul 17 , 2024 | 06:22 AM

సినిమా హీరో రాజ్‌ తరుణ్‌పై లావణ్య చేసిన ఫిర్యాదులో రాజ్‌ తరుణ్‌ను విచారించేందుకు నార్సింగ్‌ పోలీసులు సిద్ధమయ్యారు. రేపు విచారణకు హాజరు కావాలని రాజ్‌తరుణ్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది...

సినిమా హీరో రాజ్‌ తరుణ్‌పై లావణ్య చేసిన ఫిర్యాదులో రాజ్‌ తరుణ్‌ను విచారించేందుకు నార్సింగ్‌ పోలీసులు సిద్ధమయ్యారు. రేపు విచారణకు హాజరు కావాలని రాజ్‌తరుణ్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేయడంతో పాటు పలు అంశాలపై ఆరా తీయ్యనున్నారు. రాజ్‌ తరుణ్‌కు నోటీసులు ఇచ్చినట్లు మంగళవారం ప్రచారం జరిగింది. అయితే ఈ కేసులో నోటీసుల విషయం పై నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ హరికృష్ణారెడ్డిని వివరణ కోసం సంప్రదించగా ఆయన స్పందించలేదు.

నార్సింగ్‌ (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jul 18 , 2024 | 11:38 PM