పారిపోయే పిరికిదాన్ని కాదు

ABN , Publish Date - May 23 , 2024 | 06:20 AM

‘నేను భయంతో పారిపోయే పిరికిదాన్ని కాదు.. నాకు కొంత బ్రీథింగ్‌ ప్లేస్‌ కావాలి. అందుకే రెండు రోజుల్లో మీడియా ముందుకు వస్తా. అందరి పని చెప్తా’ అన్నారు నటి హేమ. బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో తను...

పారిపోయే పిరికిదాన్ని కాదు

‘నేను భయంతో పారిపోయే పిరికిదాన్ని కాదు.. నాకు కొంత బ్రీథింగ్‌ ప్లేస్‌ కావాలి. అందుకే రెండు రోజుల్లో మీడియా ముందుకు వస్తా. అందరి పని చెప్తా’ అన్నారు నటి హేమ. బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో తను పాల్గొనలేదని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆమె మరోసారి స్పష్టం చేశారు. ఈ రేవ్‌ పార్టీలో తెలుగు నటి హేమ కూడా ఉన్నారని బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించిన తర్వాత కూడా తను హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ పేర్కొనడం గమనార్హం. రెండు రోజుల నుంచి కొన్ని వందల ఫోన్‌ కాల్స్‌కు రిప్లయి ఇస్తున్నాననీ, నిజంగా అంత పెద్ద ఇష్యూలో ఉంటే ఫోన్‌ తన దగ్గర ఎలా ఉంటుంది అని హేమ ప్రశ్నించారు. తన జీవితంతో ఎవరు ఇలా ఆడుకుంటున్నారో, దీని వెనుక ఏ వెధవలు కుట్ర పన్నుతున్నారో కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాననీ, అన్నీ తెలుసుకుని మీడియాకు చెబుతానని ఆమె అన్నారు. బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో నటి హేమ కూడా పాల్గొన్నారనీ, డ్రగ్స్‌తో దొరికారని నటి కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే పోలీసులకు దొరికిపోయి కూడా హేమ ఇంకా బుకాయిస్తున్నారని ‘బిగ్‌బాస్‌’లో పాల్గొన్న తమన్నా సింహాద్రి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో తను కూడా ఉన్నానంటూ వచ్చిన వార్తలను యాంకర్‌ శ్యామల ఖండించారు. ఓ పార్టీకి మద్దతు పలికినందుకే తన గురించి ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు.

Updated Date - May 23 , 2024 | 06:28 PM