రిలేషన్స్‌పై నమ్మకం లేదు

ABN , Publish Date - Apr 26 , 2024 | 06:22 AM

‘సీతా రామం’, ‘హాయ్‌ నాన్న’, ‘ఫ్యామిలీ స్టార్‌’ వంటి చిత్రాలతో తెలుగులో పాపులర్‌ అయ్యారు మృణాల్‌ ఠాకూర్‌. ఇటీవల మీడియాతో ముచ్చటించిన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు...

రిలేషన్స్‌పై నమ్మకం లేదు

‘సీతా రామం’, ‘హాయ్‌ నాన్న’, ‘ఫ్యామిలీ స్టార్‌’ వంటి చిత్రాలతో తెలుగులో పాపులర్‌ అయ్యారు మృణాల్‌ ఠాకూర్‌. ఇటీవల మీడియాతో ముచ్చటించిన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘‘వర్క్‌ లైఫ్‌ ఒత్తిడి, ఆందోళనలు వ్యక్తిగత జీవితంపై పడకుండా బ్యాలెన్స్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. కెరీర్‌ ప్రారంభ దశలో బాడీ షేమింగ్‌ ఎదుర్కొన్నాను. నా బాడీ స్ట్రక్చర్‌ హీరోయిన్‌కు సెట్‌ కాదని, స్ర్కీన్‌ మీద గ్లామర్‌సగా కనిపించనని విమర్శించేవారు. కానీ వాటన్నింటినీ సవాలుగా తీసుకున్నా. ఇండస్ట్రీలోని బ్యూటీ స్టాండర్డ్స్‌ను మార్చాలని నిశ్చయించుకున్నా. ప్రస్తుత కాలపు రిలేషన్స్‌పై నమ్మకం లేదు. ఒకరితో జీవితం సజావుగా సాగాలంటే మనల్ని, మన ప్రొఫెషనల్‌ లైఫ్‌ను పూర్తిగా అర్థం చేసుకునే భాగస్వామిని పొందడం అవసరం. ఇక, పిల్లలను కనే విషయమై ఎగ్‌ ఫ్రీజింగ్‌ (అండాలను నిల్వ చేయడం) ఆలోచన ఉంది’’ అని చెప్పారు.

Updated Date - Apr 28 , 2024 | 01:33 PM