Maa Oori Raja Reddy: మా ఊరి రాజారెడ్డి సినిమా YSRని గుర్తు చేస్తుంది.. డైరెక్టర్ మధ్యలో వదిలేశాడు

ABN , Publish Date - Feb 26 , 2024 | 03:12 PM

నిహాన్ , వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర దర్శకత్వంలో RS మూవీ మేకర్స్ పై రజిత రవీందర్, ఎర్ర, సునీత వెంకటరమణ అయిత నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం మా ఊరి రాజారెడ్డి. ఇటీవ‌ల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. మార్చ్ 1న గ్రాండ్ గా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు.

Maa Oori Raja Reddy: మా ఊరి రాజారెడ్డి సినిమా YSRని గుర్తు చేస్తుంది.. డైరెక్టర్ మధ్యలో వదిలేశాడు
maa oori raja reddy

నిహాన్ (Nihan), వైష్ణవి కాంబ్లే (Vaishnavi Kamble) జంటగా రవి బాసర ( Ravi Basara) దర్శకత్వంలో ఆర్ ఎస్ మూవీ మేకర్స్ (RS Movie Makers) పై రజిత రవీందర్ (Erra Ravinder), ఎర్ర, సునీత వెంకటరమణ అయిత నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం మా ఊరి రాజారెడ్డి (Ma Oori Raja Reddy). ఇటీవ‌ల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. మార్చ్ 1న గ్రాండ్ గా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు.

ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి వేణుగోపాల చారి ముఖ్య అతిథిగా హ‌జ‌రై మాట్లాడుతూ.. మా ఊరి రాజారెడ్డి అనే సినిమా స్వర్గీయ రాజా రెడ్డి గారిని గుర్తుకు చేసేలా ఉంటుంది. ఆయన అంచలంచెలుగా రాజకీయాల్లో ఒక నిష్ణాతుడైన ముఖ్యమంత్రిగా ఎదిగిన కథను మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆయన మంచితనానికి నిదర్శనంగా ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నటించిన వాళ్లు, సాంకేతిక నిపుణులంతా నిర్మల్ ప్రాంతం వాళ్ళవడం నిజంగా ఆనందదాయకం అన్నారు. ప్ర‌స్తుతం హైదరాబాద్ ఒక ముఖ్య ప్రాంతంగా మారి ఇక్కడ నుంచి మన తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి ఎదగడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. నేడు తెలంగాణలో నిర్మల్, అదిలాబాద్, వరంగల్ లాంటి ప్రదేశాల్లో చాలా అద్భుతమైన లొకేషన్స్, వాటర్ ఫాల్స్, అటవీ ప్రాంతాలు ఉన్నాయ‌న్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.


raji redddy.webp

నిర్మాత వెంకటరమణ మాట్లాడుతూ.. మా ఊరి రాజారెడ్డి (Ma Oori Raja Reddy) సినిమాని నిర్మల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిత్రీక‌రించామ‌ని, ఖచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని, ప్రేక్షకుల ఆశీస్సులు మాపై ఉండాలన్నారు.హీరో నిహాన్ మాట్లాడుతూ.. నేను సినిమాలో నటించడానికి మా అమ్మ నన్ను ప్రోత్సహించిందని,. ఈ సినిమాకి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ల‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అన్నారు. చాలా కష్టపడి సినిమాని చేశామ‌ని, ప్రేక్షకులు చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. హీరోయిన్ వైష్ణవి మాట్లాడుతూ.. ఇది నాకు మొదటి సినిమా అని.. మా పేరెంట్స్ ని నెమ్మదిగా ఒప్పించి ఇండస్ట్రీలోకి వచ్చానని.. నన్ను ఈ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసుకున్నందుకు కృతజ్ఞతలని, కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని.. మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.

కో డైరెక్టర్ రవీంద్ర సిద్ధార్థ మాట్లాడుతూ.. నేను పూరి జగన్నాథ్ గారికి వీరాభిమానిన‌ని.. మా డైరెక్టర్ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చేసి మధ్యలో వదిలేస్తే. సెకండ్ షెడ్యూల్ నేను పూర్తి చేశానన్నారు. హైదరాబాదులో ఉండే వాళ్ళకే కాకుండా టాలెంట్ అన్నిచోట్ల ఉంటుంద‌ని.. మేం నిర్మల్ నుంచి వచ్చామన్నారు. మాలాంటి దర్శకులని ప్రోత్సహించాలని కోరుకుంటున్నా అన్నారు. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాపై ఉండాలని ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 03:13 PM