ఇండియ‌న్ 2.. నైజాం రైట్స్ ద‌క్కించుకున్న ఏసియ‌న్‌

ABN , Publish Date - Feb 21 , 2024 | 09:51 PM

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ , సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై శుభాస్క‌ర‌న్, ఉద‌య‌నిధి స్టాలిన్‌ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం భార‌తీయుడు. అప్పెడెప్పుడో ఐదారేండ్ల క్రితం ఫ్రారంభ‌మైన ఈ చిత్రం వాయిదాలు మీద వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఇండియ‌న్ 2.. నైజాం రైట్స్ ద‌క్కించుకున్న ఏసియ‌న్‌
indian 2

Bharateeyudu 2 An Intro Teaser Out యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan ), సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (Shankar Shanmugham) కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ (Lyca Productions) తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై శుభాస్క‌ర‌న్, ఉద‌య‌నిధి స్టాలిన్‌ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం భార‌తీయుడు( Bharateeyudu 2). అప్పెడెప్పుడో ఐదారేండ్ల క్రితం ఫ్రారంభ‌మైన ఈ చిత్రం వాయిదాలు మీద వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

l40120220618135210.jpg

ఈ సినిమాలో సిద్ధార్థ్ (Siddharth), బ్ర‌హ్మానందం, బాబీ సింహా, ఎస్జే సూర్య (S. J. Suryah), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar), గుల్ష‌న్ గ్రోవ‌ర్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఆ మ‌ధ్య‌ చిత్రం ఇంట్రో టీజర్‌ను మేకర్స్ విడుదల చేయ‌గా సినిమాపై అంచానాల‌ను పెంచేసింది.


GG2ghW1aYAAUXRL.jpg

రెండు భాగాలుగా వ‌స్తున్న ఈసినిమాలో మొద‌టి భాగాన్ని వేస‌వి సెల‌వుల్లో గానీ విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం నైజాం హ‌క్కుల‌ను ఏషియన్ సురేష్ ఎంటర్టైనర్మెంట్ ఎల్ఎల్పీ (సురేష్ ప్రొడక్షన్) (Asian Cinemas)మంచి ఫ్యాన్సీ రేట్స్‌కు దక్కించుకుంది. గతంలో ఈ భార‌తీయుడు( Bharateeyudu 2) చిత్రం రేట్స్ నిమిత్తం రూ.75 కోట్ల వ‌ర‌కు పెట్టేందుకు టాలీవుడ్ నిర్మాత‌లు పోటీ ప‌డ్డార‌నే వార్త‌లు బాగా వైర‌ల్ అయ్యాయి. కానీ చివ‌ర‌కు ఏసియ‌న్ చేతికి ఇండియ‌న్ 2 రైట్స్ వెళ్ల‌డంపై నెట్టింట పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.

Updated Date - Feb 22 , 2024 | 12:04 AM