త్యాగరాయగానసభకు పురాణపండ ‘శ్రీమాలిక’ను అలంకరించిన కళా జనార్ధనమూర్తి

ABN , Publish Date - May 18 , 2024 | 10:00 AM

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో, జంటనగరాల్లో కళారంగాల ప్రముఖుల్లో తమ గృహాల పూజా పీఠాలముందు పురాణపండ గ్రంధాలకే అగ్ర తాంబూలమనేది స్పష్టంగా దర్శనమిస్తోంది. మరొక ప్రధానాంశమేమంటే... తెలుగు రాష్ట్రాలలో ఒక కళావేదికపై జరిగే సాంస్కృతిక, సాహిత్య ఉత్సవాలకు విచ్చేసే నెలలు నెలలుగా ప్రముఖులకు బుక్‌ని ప్రెజెంట్ చేసి ఉత్తమ కీర్తిని మూట కట్టుకున్న కళా జనార్ధన మూర్తిని ఇటు సినీ ప్రముఖుల, అటు సాహిత్య సాంస్కృతిక కళా సంస్థలు అభినందించడం హర్షణీయం. ఈ ఉత్తమకార్యాలకు తనకు ఎంతో ప్రోత్సాహమందిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి కె. వి. రమణాచారికి, కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యకి ధన్యవాదాలు తెలిపారు కళా జనార్ధనమూర్తి.

త్యాగరాయగానసభకు పురాణపండ ‘శ్రీమాలిక’ను అలంకరించిన కళా జనార్ధనమూర్తి

‘‘తలపుల తలపోతలు స్వచ్ఛమయమై, మనస్సు నిండా సంతోషం పొంగులెత్తాలంటే కళల్ని ప్రేమించి... కళాకారులమధ్య గడుపు....అడవిలో కొండల మధ్య జలపాతాల్లో కురిసే వెన్నెల్లో తడిసే అనుభూతి నిన్ను ఆవరిస్తుంది.. ఆ అదృష్టం ఊహించలేనిది’’ అని అంటారు నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ (Rabindranath Tagore). ఈ అంశంలోంచి చూస్తే... హైదరాబాద్ త్యాగరాయ గానసభ కళలతో... కళాకారుల సందళ్ళతో... కళా సౌందర్యాలతో దశాబ్దాలుగా మెరిసిపోతూ చరిత్రాత్మకమైంది. ఇలాంటి త్యాగరాయ గానసభ (Tyagaraya Gana Sabha)లో అడుగుపెట్టని తెలుగు రాజకీయ సినీ ప్రముఖులు లేరనేది కఠినమైన సత్యం.

Suseela.jpg

ఎన్నో ... ఎన్నెన్నో సాంస్కృతిక సంస్థలకు సహృదయాత్మక సౌజన్యభరిత సేవలందిస్తున్న త్యాగరాయగానసభ ద్వారా దశాబ్దం వెనుక వరకూ ఎంతో సంస్కారవంతమైన సేవలందించిన కళా దీక్షితులును ఈనాటికీ మర్చిపోలేమంటున్నారు రసజ్ఞులు. కళా దీక్షితులు కాలం చేసిన తరువాత ఆయన సోదరుడు, కళా పిపాసి కళా జనార్ధన మూర్తి (Janardhana Murthy) త్యాగరాయగానసభ సారధ్యం వహించినప్పటినుంచీ ఇంకా సేవల్ని విస్తృతం చెయ్యటం గమనార్హం. త్యాగరాయ గానసభ కళా సంస్థలకు, సాహిత్య సంస్థలకు ఎక్కువ అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో గానసభ ఆడిటోరియం రేట్లను కూడా తగ్గించి ఎన్నో కళావేదికల కార్యక్రమాలకు సహకరించి ఆదర్శప్రాయంగా జనార్ధనమూర్తి నిలిచారనేది అక్కడ ప్రత్యక్షంగా కనిపించే సత్యం. అంతే కాదు జనార్ధనమూర్తి సారధ్యంలో తెలుగు రాష్ట్రాలలో తొలిసారిగా సంవత్సరం పొడుగునా... అంటే ... మూడువందల అరవై ఐదు రోజులూ నిరాఘాటంగా కార్యక్రమాలు జరపటానికి తెరతీసి... ఆచరణాత్మకంగా చేసి చూపిస్తూ, సంచలనం సృష్టించడం మామూలు విషయం కాదంటున్నారు ఎందరో మేధావులు.

Kavitha.jpg

ఇక ప్రధానాంశంలోకి వస్తే... ఇటీవల త్యాగరాయగానసభలో జరిగే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న అనేకమంది దిగ్గజాలకు, అతిధులకు... కళా జనార్ధనమూర్తి ‘శ్రీమాలిక’ అనే సుమారు మూడు వందల పేజీల అపురూప గ్రంధాన్ని బహూకరించడంపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

తెలుగు రాష్ట్రాలలో విశేష ప్రాచుర్యం సంపాదించుకున్న ఈ పవిత్ర చైతన్యాన్ని విఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ ‘జ్ఞానమహాయజ్ఞ కేంద్రం’ ప్రచురించింది. ఇప్పటికే వందలకొలది ఆలయాల, పీఠాల, మఠాలలో నిత్యం ఉభయసంధ్యలలో ప్రార్ధనా పారాయణలకు దీపశిఖలా వెలుగు చూపిస్తున్న ఈ శ్రీమాలిక గ్రంథ రచనా సంకలనకర్త ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) ఈ అపూర్వగ్రంధంలో అందించిన పవిత్ర వ్యాఖ్యాన వైఖరులు అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్నాయనడం నిర్వివాదాంశం. శ్రీనివాస్ ప్రతిభా పతాకాన్ని ప్రత్యేకంగా రెపరెపలాడించాల్సిన అవసరంలేదు.

Kishan-Reddy.jpg

‘శ్రీమాలిక’ (Sree Malika) అక్షర దివ్యత్వాన్ని అందుకున్న రచయితలు, కవులు, కళాకారులు, అతిధులు, సాహితీప్రియులు, భక్తులు... మరొక శ్రీమాలిక బుక్ ఇమ్మని అడుగుతున్నారని ... ఈ బుక్‌లో అలాంటి విలువైన, జీవన సార్ధకతకు అవసరమైన కంటెంట్ శ్రీనివాస్ అందించడం చాలా సమ్మోహనమైందని త్యాగరాయగానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి పేర్కొంటున్నారు.

Kavitha-and-Book.jpg

అంతే కాదు... కళా జనార్ధనమూర్తి ధర్మాధికారిగా పరమ పవిత్ర సేవలు అందిస్తున్న శృంగేరి శారదా పీఠంవారి జ్ఞానసరస్వతీ దేవాలయంలో కూడా ఈ శ్రీమాలిక గ్రంధాన్ని ప్రత్యేక ఉత్సవాల్లో ఇవ్వడంతో ఈ పుస్తకానికి అనూహ్యస్పందన వచ్చి భక్తుల ఒత్తిడి ఎక్కువైందని ఆలయ అర్చక పండితులు ముక్తకంఠంతో చెబుతున్నారు.

అసాధారణ ప్రతిభావంతుడైన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవన పోరాటంలో ఎన్నో సవాలెదుర్కొని కూడా... భారతీయ ఆధ్యాత్మిక ధార్మిక రంగాలకు నిస్వార్ధంగా చేస్తున్న సేవ కేవలం దైవబలమేనని.... అన్నింటా వ్యాపారాత్మక కనికట్లు పెరుగుతున్న ఈ రోజుల్లో ఇలా ఇన్ని విలువైన ఎన్నో గ్రంథ వైభవాల అద్భుతాలను పురాణపండ శ్రీనివాస్ ఇంత నిస్వార్ధంగా అందించడం మామూలు విషయం కాదని సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రత్యేక సలహాదారు కే. వి . రమణాచారి (KV Ramana Chari) అనేకసార్లు స్ఫష్టం చెయ్యడం ముదావహం.

Janardhan-Maharshi.jpg

సంవత్సరానికి ఒకట్రెండుసార్లు మాత్రమే త్యాగరాయగాన సభకు అకస్మాత్తుగా వచ్చి ఆత్మీయంగా పలకరించి, ఏదో ఒక సభలో పాల్గొని పురాణపండ వెళ్ళిపోతూంటారని, ఆయనతో ఈ మెయిల్ ద్వారానే గ్రంధాల సంప్రదింపులు జరుపుతామని, త్యాగరాయగానసభలో ఇంతవరకూ ఇలాంటి గ్రంథ వితరణ నిర్విరామంగా జరగటం ఇదే మొదటిసారని... ఈ పుస్తక ప్రసాద సేవకు పురాణపండకు దైవం ఇచ్చిన మనోబలాన్ని ప్రశంసించకుండా ఉండలేమని కళా జనార్ధనమూర్తి అభినందనలు వర్షించారు.

ఎందరో ఐఏఎస్ లకు, న్యాయమూర్తులకు, ఐపీఎస్ లకు, మేధావులకు, భక్త బృందాలకు, కళాకారులకు, సాహితీ మూర్తులకు తన చేత్తో తానే స్వయంగా ఈ శ్రీమాలికతో పాటు మరెన్నో పురాణపండ గ్రంధాలను బహూకరించానని... ఈ గ్రంథ సంపదనందుకున్న వారి స్పందన అనూహ్యమని జనార్ధనమూర్తి పేర్కొన్నారు.

కేంద్రప్రభుత్వ ఫిలిం సర్టిఫికేషన్ గౌరవ సభ్యునిగా కూడా వున్న జనార్ధనమూర్తి ఇటీవల ఒక సినిమా ఫంక్షన్‌లో కూడా ఈ గ్రంధాలు పంచడంతో కొందరు సినీప్రముఖులు సైతం జనార్ధనమూర్తిని మంచి గ్రంధాన్నిచ్చావంటూ అభినందించడం కనిపించింది. అయితే... సినీ రంగంలో చాలామంది ప్రముఖులకు చాలాకాలంగా వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి (Sai Korrapati), శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు (Dil Raju), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలు టి.జి.విశ్వప్రసాద్ (TG Viswa Prasad), కూచిభొట్ల వివేక్ (Vivek) ద్వారా పురాణపండ అపురూప గ్రంధాలు తెలుగు చలన చిత్ర ప్రముఖులకు నిరాఘాటంగా అందుతూనే ఉన్నాయని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ప్రముఖుడొకరు సంతోషాన్ని వ్యక్తంచేయడం గమనార్హం. అంతే కాకుండా శ్రీనగర్ కాలనీ, అమీర్ పేట ఆలయాల్లో దిల్ రాజు ప్రచురించిన బుక్స్ ఆయన మేనేజర్ శేషగిరిరావు చాలా సమర్పణా భావంతో అందించేవారనీ , ఇక సినీ రంగంలోనూ, పెద్దమ్మతల్లి ఆలయం, ఫిలిం నగర్ దైవ సన్నిధానం వంటి ఆలయాల నుండి గచ్చీబౌలీ ఆలయాల వరకూ ఉన్న అనేక ఆలయాలకు వారాహి చలన చిత్రం ఉద్యోగ బృందాలు పురాణపండ అపురూప గ్రంథాల్ని ఇచ్చేవారని, పీపుల్ మీడియా వారు నిర్మాత విశ్వప్రసాద్ తల్లి మరణసమయంలో స్మృతిగా వందల భక్తులకు అందించినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం.

Geethanjali.jpg

ఏది ఏమైనా... తెలుగు చలన చిత్ర పరిశ్రమలో, జంటనగరాల్లో కళారంగాల ప్రముఖుల్లో తమ గృహాల పూజా పీఠాలముందు పురాణపండ గ్రంధాలకే అగ్ర తాంబూలమనేది స్పష్టంగా దర్శనమిస్తోంది. మరొక ప్రధానాంశమేమంటే... తెలుగు రాష్ట్రాలలో ఒక కళావేదికపై జరిగే సాంస్కృతిక , సాహిత్య ఉత్సవాలకు విచ్చేసే నెలలు నెలలుగా ప్రముఖులకు బుక్‌ని ప్రెజెంట్ చేసి ఉత్తమ కీర్తిని మూట కట్టుకున్న కళా జనార్ధన మూర్తిని ఇటు సినీ ప్రముఖుల, అటు సాహిత్య సాంస్కృతిక కళా సంస్థలు అభినందించడం హర్షణీయం.

KV-Ramana-Chari.jpg

విమర్శల్ని విసిరి కొడుతూ... వీసమెత్తు స్వార్ధం లేకుండా ఇంతటి మహాకార్యాన్ని ఇన్ని ఊళ్లకు, ఇన్ని గుళ్లకు, ఇన్ని కళా సంస్థలకు అందించే శ్రీకార్యాన్ని మోస్తున్న అద్భుత వక్త, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ వెనుక వున్న దైవబలానికి, అకుంఠిత దీక్షాదక్షతలకూ నమస్కరించాల్సిదేనంటున్నారు రసజ్ఞులైన విజ్ఞులు.

ఈ ఉత్తమకార్యాలకు తనకు ఎంతో ప్రోత్సాహమందిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి కె. వి. రమణాచారికి, కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య (Bollineni Krishnaiah)కి ధన్యవాదాలు తెలిపారు కళా జనార్ధనమూర్తి.

Updated Date - May 18 , 2024 | 06:44 PM